ఆ సూపర్ హిట్ పాటని చిరుతో నేను చేయాల్సింది, మరో హీరోయిన్ కి మార్చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేశా
బాపు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి పుస్తకం చిత్రంతో దివ్యవాణి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. దివ్యవాణి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళలేదు. అందుకు కారణం ఆమె కొన్ని అవకాశాలు జారవిడుచుకోవడమే.
90 దశకంలో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో దివ్యవాణి ఒకరు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి పుస్తకం చిత్రంతో దివ్యవాణి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. దివ్యవాణి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళలేదు. అందుకు కారణం ఆమె కొన్ని అవకాశాలు జారవిడుచుకోవడమే. ఏది ఏమైనా దివ్యవాణి అప్పట్లో బాపు బొమ్మ అంటూ ప్రశంసలు దక్కించుకుంది.
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు పెళ్లి పుస్తకం చిత్రం, అందులోనే శ్రీరస్తు శుభమస్తు సాంగ్ ఉంటుంది అని దివ్యవాణి తెలిపారు. 1987లోనే దివ్యవాణి కెరీర్ ప్రారంభించారు. అయితే గుర్తింపు లభించింది మాత్రం 1991లో ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ చిత్రంతోనే. అప్పటి నుంచి దివ్యవాణి వరుస హిట్ చిత్రాలు అందుకుంది. పెళ్లి పుస్తకం చిత్రంతో ఆమె క్రేజ్ పీక్ స్టేజికి చేరింది.
తన కెరీర్ లో కొన్ని అవకాశాలు చేజారాయి అని, కొన్ని చిత్రాల్లో అన్యాయం జరిగింది అని దివ్యవాణి పేర్కొన్నారు. ముఖ్యంగా చిరంజీవి కొండవీటి దొంగ చిత్రంతో తనకు చాలా అసంతృప్తి ఉందని దివ్యవాణి పేర్కొన్నారు. ఈ చిత్రంలో రాధా, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. దివ్యవాణి కూడా ఒక పాత్రలో మెరిసింది. చిరంజీవికి ఆమె మరదలిగా నటించారు.
ఈ చిత్రంలోని శుభలేఖ రాసుకున్న అనే సాంగ్ ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సాంగ్ లో చిరు, రాధా జోడి చూడముచ్చటగా ఉంటుంది. వాస్తవానికి ఈ సాంగ్ ని చిరంజీవి, దివ్యవాణి కోసం ప్లాన్ చేశారట. చిరంజీవితో నీకు సాంగ్ ఉంది అని కూడా చెప్పారు. దీనితో చాలా సంబరపడిపోయాను. కానీ షూటింగ్ కి కొన్ని రోజుల ముందు ఆ సన్నివేశాన్ని మార్చేసి ఆ పాటని రాధతో చేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి పరుచూరి గోపాల కృష్ణగారే.
ఆ సాంగ్ నువ్వే చేయాల్సింది.. కానీ ఏమి చేయలేకపోయాం అని చెప్పారు. నేను ఏడ్చేశా. మా అమ్మ కూడా చాలా బాధపడింది అని దివ్యవాణి తెలిపింది. ఆ తర్వాత చిరంజీవి గారు ఎక్కడ కనిపించినా ఆయన్ని అడిగే దానిని.. సర్ మీతో హీరోయిన్ గా ఒక సినిమా చేయాలి అని. ఒక రోజు ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే అడిగా.. నీకేవమ్మా హ్యాట్రిక్ హిట్లు కొట్టేశావ్ అంటూ ప్రశంసించారు.
కానీ నాకున్న నిబంధనల వల్ల, దురదృష్టం వల్ల కొన్ని ఆఫర్స్ కోల్పోయాను. రాజేంద్ర ప్రసాద్ తో మిస్టర్ పెళ్ళాం చిత్రం నేను చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చేజారింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఒక చిత్రం చేజారింది. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రం ఘరానామొగుడు లో వాణి విశ్వనాధ్ పాత్రకి ముందుగా నాకే ఆఫర్ వచ్చింది. గ్లామరస్ పాత్ర కాబట్టి వదులుకున్నాను అని దివ్యవాణి తెలిపారు.
వాణి విశ్వనాధ్ ఘరానా మొగుడు చిత్రంలో గ్లామరస్ గా కనిపించి మెప్పించారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే రైన్ సాంగ్ లో అయితే వాణి విశ్వనాధ్ రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. అలా గ్లామరస్ గా డ్యాన్స్ చేయడం తనకి ఇబ్బంది అని ఆ ఆఫర్ ని వదులుకుంది. ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో ఘరానా మొగుడు కూడా ఒకటి.
దివ్యవాణి రాజకీయాల్లో కూడా కొంతకాలం ఉన్నారు. తెలుగు దేశం పార్టీలో మూడేళ్లు యాక్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. దివ్యవాణి చివరగా మహానటి చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. తనని సెట్స్ లో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అందరూ ప్రశంసించే వారు అంటూ దివ్యవాణి తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు తాను ఎప్పుడూ గర్వపడుతుంటాను అని అన్నారు.
ముత్యమంత ముద్దు, కొండవీటి దొంగ, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం , పెళ్ళి పుస్తకం ,లేడీస్ స్పెషల్, గౌరమ్మ , దోషి , పెళ్ళినీకు శుభం నాకు, మొగుడు పెళ్ళాల దొంగాట, రగులుతున్న భారతం, సంసారాల మెకానిక్, నా మొగుడు నా ఇష్టం, పిల్లలు దిద్దిన కాపురం లాంటి చిత్రాల్లో దివ్యవాణి నటించారు.