MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నీ ఇంట్లో ఎగురుకో బయట కాదు, సీఎం దగ్గర తలదించుకునే పరిస్థితి.. బన్నీని ఏకిపారేసిన సురేష్ బాబు, తమ్మారెడ్డి

నీ ఇంట్లో ఎగురుకో బయట కాదు, సీఎం దగ్గర తలదించుకునే పరిస్థితి.. బన్నీని ఏకిపారేసిన సురేష్ బాబు, తమ్మారెడ్డి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన వల్ల పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఎ 11 గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 27 2024, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన వల్ల పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఎ 11 గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనని సీరియస్ గా తీసుకోవడంతో ఎంత పెద్ద రచ్చ అయిందో చూశాం. 

26

అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యాక సినీ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది. అల్లు అర్జున్ ని సినీ ప్రముఖులంతా పరామర్శించారు. అప్పడు పరామర్శించిన వారే ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా అల్లు అర్జున్ ని కలసి పరామర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత సీన్ రివర్స్ అయింది. 

36

అల్లు అర్జున్ ని పరోక్షంగా ఏకిపారేస్తూ సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాత్రమే కాదు తమ్మారెడ్డి కూడా అల్లు అర్జున్ దే తప్పు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సీఎం దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

46

రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ.. నీవు పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోవాలి. ఒక్కరు కాదు అందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలి అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి అని సురేష్ బాబు అన్నారు. 

56

నీ ఇంట్లో నువ్వు ఎగురు, డ్యాన్స్ చెయ్ ఎమన్నా చేసుకో.. కానీ బయటకి వచ్చినపుడు పద్దతిగా ఉండాలి కదా అంటూ సురేష్ బాబు మండిపడ్డారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ట్రీ మొత్తం వెళ్లి ముఖ్యమంత్రి దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా ఒక్క మనిషి వల్ల అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ ని తమ్మారెడ్డి దుమ్మెత్తి పోశారు. ఆ మనిషి కావాలనే చేయకపోవచ్చు.. కానీ తప్పైతే అతడి వల్ల జరిగింది. థియేటర్ వద్ద రోడ్ షో చేయడం, హంగామా చేయడం వల్ల ఇదంతా జరిగింది. కావాలని చేయకపోవచ్చు. కానీ తప్పు జరిగింది కదా అని తమ్మారెడ్డి అన్నారు. 

Also Read: ఇది కదా జోడీ అంటే, నితిన్ తో తొలిసారి సాయి పల్లవి రొమాన్స్.. 'ఎల్లమ్మ'లో పవర్ ఫుల్ రోల్ ?

66

ఈ తప్పు జరిగిన తర్వాత దానిని కవర్ చేయడానికి కొన్ని అబద్దాలు ఆడాల్సి వచ్చింది. దీనితో ఈ అంశం ప్రభుత్వానికి కీలకంగా మారిపోయింది. దీని పర్యవసానంగా ఇండస్ట్రీ మొత్తం సీఎం దగ్గర కూర్చున్నారు. ఇది ఒక రకంగా తలవంపులే అని తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit Update: `స్పిరిట్‌`లో వివేక్‌ ఒబెరాయ్‌.. అంచనాలకు అందని సందీప్‌ రెడ్డి ప్లాన్‌
Recommended image2
తీవ్ర పోటీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీ హక్కులు ఎంత ధరకు అమ్ముడయ్యాయో తెలుసా ?
Recommended image3
Vijay Divorce: ఆ హీరోయిన్‌తో విజయ్‌కి ఎఫైర్, కోర్టుకెక్కిన భార్య సంగీత.. పిటిషన్‌లో సంచలన విషయాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved