ప్రముఖ బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీని అభిమానించే వారి సంఖ్య ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయాలని హీరోలు ఎదురుచూస్తుంటారు.

ఎప్పుడూ తన సినిమాలతో బిజీగా ఉండే ఈ దర్శకుడిపై మహిళా సహాయక దర్శకురాలు లైంగిక ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని హిరాని కొట్టి పారేసినప్పటికీ బాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో హిరానీకి మద్దతు ఇస్తోన్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

ఇప్పటికే దియా మీర్జా, జావేద్ అక్తర్, షర్మాన్ జోషి వంటి వారు హిరానీకి మద్దతుగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తుండగా.. మరికొందరు నిజాలు బయటపడిన తరువాత  మాట్లాడదామని ఊరుకున్నారు. రీసెంట్ గా నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా నిజనిర్ధారణ జరిగే వరకు ఈ విషయం మాట్లాడకపోవడమే మంచిదని అన్నారు.

ఆప్పుడు ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఈ విషయంపై స్పందించాడు. రాజ్ కుమార్ చాలా మంచివాడని, ఆయనపై వచ్చిన ఆరోపణలను నమ్మనని అన్నారు. హిరానీ ఎప్పటికీ అలాంటి పని చేయడని చాలా నమ్మకంగా చెప్పారు. 

ఆయన లైంగిక వేధింపులు చేసే డైరక్టర్ కాదు, మంచివాడు

ఆరు నెలలు లైంగికంగా వేధించారు.. స్టార్ డైరెక్టర్ పై ఆరోపణలు!

మీటూ ఎఫెక్ట్: నెంబర్ వన్ డైరెక్టర్ కు కష్టాలు