ఇండియాలో టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరైన రాజ్ కుమార్ హిరానీ ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం అందరిని షాక్ కి గురి చేసింది. సంజూ సినిమా నిర్మాణానంతరం రాజ్ కుమార్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఓ మహిళ చేసిన  ఆరోపణలు నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే అదే ఇప్పుడు ఆయన కెరీర్ కు కష్టంగా మారింది. 

నెక్స్ట్ సినిమా చేయడానికి కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది. ఆరోపణలపై క్లారిటీ వచ్చే వరకు మున్నాభాయ్ 3 షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సే లేదని ఫోక్స్ సంస్థ తెలిపింది. అంతే కాకుండా   సోనమ్‌ కపూర్‌, అనిల్‌ కపూర్ లు ప్రధాన పాత్రలో నటించిన ‘ఏక్‌ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ ప్రమోషన్‌ ఈవెంట్ లో నుంచి కూడా రాజ్ కుమార్ హిరానీ పేరును తొలగించడం చర్చనీయాంశంగా మారింది. 

అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని దర్శకుడు హిరానీ వివరణ ఇచ్చినప్పటికీ ఇంకా వివాదంలో క్లారిటీ రాలేదు. ఆరోపణలు నిజమని తేలితే మున్నాభాయ్ 3 ఆగిపోతుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మున్నాభాయ్ సిరీస్ లతో పాటు 3 ఇడియట్స్ - పీకే - సంజూ సినిమాలతో రాజ్ కుమార్ వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకొని ఓటమిలేని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.