ఎవరూ ఊహించని విధంగా రాజ్‌కుమార్‌ హిరాణీ లాంటి పేరున్న దర్శకుడిపై ఓ మహిళా దర్శకురాలు మీటూ ఆరోపణలు చేసి మీటూ ఉద్యమం మళ్లీ రాజేసిన సంగతి తెలిసిందే. ‘సంజు’ సినిమా షూటింగ్‌ సమయంలో హిరాణీ తనను దాదాపు ఆరు నెలలపాటు లైంగికంగా వేధించారని ఆయనతో కలిసి పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించారామె. ఈ నేపధ్యంలో రాజ్ కుమార్ హిరాణీ వ్యక్తిత్వం  గురించి బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి.   

ఈ నేపధ్యంలో  . హిరాణీతో కలిసి ‘సంజు’ సినిమా కోసం గత ఏడాది పనిచేసిన ఆమె ఆయనపై వచ్చిన వేధింపుల ఆరోపణలపై తాజాగా స్పందించారు. ఈ మేరకు ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ ఈ ఇష్యూపై తన అభిప్రాయం చెప్పారు.

దియా మీర్జా మాట్లాడుతూ... ‘ఈ వార్త తెలిశాక చాలా బాధపడ్డా. గత 15 ఏళ్లుగా రాజ్‌ సర్‌ వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా ఈ విషయంపై చట్టపరమైన విచారణ చేపట్టాలని కోరుతున్నా. నేను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన వారిలో ఆయన అతి మంచి స్వభావం కల్గిన వ్యక్తి. దీని గురించి నేను మాట్లాడటం సరికాదు... ఎందుకంటే నాకు ఏం జరిగిందో తెలియదు కదా’ అని ఆమె చెప్పారు.

మరో ప్రక్క తనపై వచ్చిన ఆరోపణలను ఉద్దేశించి హిరాణీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అశోసియేట్ దర్శకురాలు చేసిన ఆరోపణలు నన్ను షాక్‌కు గురి చేశాయి. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. మీడియా ముందు వెళ్లి మాట్లాడటం కన్నా ఇలా చేయడమే మంచిది అనుకున్నా. ఆమెవి తప్పుడు ఆరోపణలు. నా పరువుకు భంగం కల్గించాలనే ఉద్దేశంతో ఆమె ఇలా చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 

హిరాణీ తరఫు న్యాయవాది ఆనంద్‌ దేశాయ్‌ మీడియా ద్వారా మాట్లాడుతూ..‘నా క్లయింట్‌ హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఆయన పేరు చెడగొట్టడానికి ఎవరో ఇలా చెప్పి చేయిస్తున్నారనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. 

ఆరు నెలలు లైంగికంగా వేధించారు.. స్టార్ డైరెక్టర్ పై ఆరోపణలు!

మీటూ ఎఫెక్ట్: నెంబర్ వన్ డైరెక్టర్ కు కష్టాలు