Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి మరో బిగ్ ఫంక్షన్!

దర్శకదీరుడు రాజమౌళి సినిమా చేసినా సొంత ఈవెంట్ చేసిన భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. జైపూర్ లో కొడుకు కార్తికేయ పెళ్లి చేసి చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేసిన రాజమౌళి టాలీవుడ్ టాప్ సెలబ్రెటీలను పెళ్లికి పిలిచిన సంగతి తెలిసిందే. 

rajamouli planings for karthikeya reception
Author
Hyderabad, First Published Jan 5, 2019, 11:23 AM IST

దర్శకదీరుడు రాజమౌళి సినిమా చేసినా సొంత ఈవెంట్ చేసిన భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. జైపూర్ లో కొడుకు కార్తికేయ పెళ్లి చేసి చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేసిన రాజమౌళి టాలీవుడ్ టాప్ సెలబ్రెటీలను పెళ్లికి పిలిచిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా పెళ్లి గురించి నేషనల్ వైడ్ గా మాట్లాడుకునేలా చేశాడు.  

అయితే పెళ్లికి అందరిని పిలవడం కుదరలేదని మరో ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ వచ్చేలా జక్కన్న ఇన్విటేషన్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో నిర్వహించేబోయే రిసెప్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ కి సెలబ్రెటీలతో పాటు రాజకీయ ప్రముఖులు అలాగే మరికొంత మంది వ్యాపారవేత్తలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

గతంలో ఎప్పుడు లేని విధంగా రాజమౌళి ఫ్యామిలిలో ఒక వేడుక ఘనంగా జరుగుతోంది. కీరవాణి స్పెషల్ మ్యూజిక్ తో ఇటీవల జరిగిన సంగీత్ లో అలరించాడు. ప్రభాస్ - తారక్ అల్లరితో పెళ్లిలో మంచి సందడి నెలకొల్పారు. సినిమాల పరంగానే కాకుండా దర్శకదీరుడు స్టార్ హీరోలందరిని తన ఆత్మబంధువులుగా మార్చుకోవడంతో మంచి గుణమున్న వ్యక్తి అని నిరూపించుకున్నాడు. 

సంబంధిత వార్తలు 

రాజమౌళి కొడుకు పెళ్లిలో తారక్ రచ్చ చూశారా..?

రాజమౌళి, రామ్ చరణ్ డాన్స్ చూశారా..?

పెళ్లి సందడి అంతా ప్రభాస్, అనుష్కలదే!

రాజమౌళి కొడుకు పెళ్లి.. అతిథులు వీళ్లే..!

రాజమౌళి కొడుకు పెళ్లి.. చరణ్, ఎన్టీఆర్ వాలిపోయారు!

 

Follow Us:
Download App:
  • android
  • ios