జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి ఈ చిత్రంతో హీరో గా పరిచయం అవుతున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి ఈ చిత్రంతో హీరో గా పరిచయం అవుతున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి జెనీలియా ఈ మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాధాకృష్ణారెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వైరల్ వయ్యారి అనే సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది.
జెనీలియా అందంపై రాజమౌళి క్రేజీ కామెంట్
తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి జూనియర్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. జెనీలియా రాజమౌళి దర్శకత్వంలో సై చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. జెనీలియాని రాజమౌళి ముద్దుగా జెన్నీ అని పిలుస్తూ.. నువ్వు కాలంలో ఫ్రీజ్ అయిపోయావు. నీ అందం ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ రాజమౌళి జెనీలియాని ఉద్దేశించి క్రేజీ కామెంట్ చేశారు.
ఈ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి గారు జూనియర్ మూవీ గురించి నాకు చెప్పినప్పుడు ఒక చిన్న సినిమా చేస్తున్నారేమో అనుకున్నా. కానీ శ్రీలీల, జెనీలియా, దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ ఇలా ఒక్కొక్కరి పేర్లు వింటుంటే ఇది ఏమాత్రం చిన్న సినిమా కాదు అని అనిపిస్తుంది. శ్రీలీల ఇప్పటికే స్టార్ అయిపోయింది.
కిరీటి గురించి సెంథిల్ నాకు చెప్పారు. సెంథిల్ నుంచి ప్రశంసలు అందుకున్నావంటే అంతకంటే గొప్ప విషయం లేదు అని కిరీటిని రాజమౌళి ప్రశంసించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని రాజమౌళి ఆకాంక్షించారు.