- Home
- Entertainment
- మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య నిప్పులు పోసిన అట్టర్ ఫ్లాప్ మూవీ, మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్
మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య నిప్పులు పోసిన అట్టర్ ఫ్లాప్ మూవీ, మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్
గతంలో ఒక అట్టర్ ప్లాప్ తమిళ చిత్రం వల్ల మెగా నందమూరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

సెలబ్రిటీలు కొన్ని సందర్భాల్లో చేసే కామెంట్స్ బాగా వైరల్ అవుతుంటాయి. అనుకోకుండా అవి వివాదానికి కారణం అవుతుంటాయి. మెగా, నందమూరి కుటుంబాల మధ్య తరచుగా విభేదాలు వస్తూనే ఉండడం చూస్తున్నాం. ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఆ రెండు కుటుంబాల మధ్య ఉండే పోటీ అలాంటిది.
గతంలో ఒక అట్టర్ ప్లాప్ తమిళ చిత్రం వల్ల మెగా నందమూరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో గజినీ తర్వాత సూర్య నటించిన మరో చిత్రం 7th సెన్స్. తమిళ తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రం కోసం చాలా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. బోధిధర్మ లాంటి మునులు, మహర్షులు ఎందరో మన దేశంలో వైద్య రంగంలో అద్భుతాలు చేశారని.. అలాంటి వారిని మనం గుర్తుంచుకోవాలని మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అయితే స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ఆడియో లాంచ్ కి రామ్ చరణ్ అప్పట్లో అతిథిగా హాజరయ్యారు. వేదికపై రామ్ చరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సూర్య లాంటి నటులు, ఏఆర్ మురుగదాస్ లాంటి దర్శకులు లేకపోవడం మన దురదృష్టం అంటూ రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి.
ముక్కు సూటిగా మాట్లాడే నందమూరి బాలకృష్ణ.. రామ్ చరణ్ కామెంట్స్ కి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. రామ్ చరణ్ పేరు ఎత్తకుండా.. తెలుగులో గొప్ప దర్శకులు, గొప్ప నటులు లేరని ఒకడన్నాడు. మాటల జాగ్రత్త అని అతడికే డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చా. మాట్లాడే ముందు చరిత్ర గురించి తెలుసుకోవాలి. మన తెలుగులో గొప్ప దర్శకుడు లేరా.. ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి సినిమాలు ఎలా వచ్చాయి అని బాలకృష్ణ రామ్ చరణ్ కి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. రామ్ చరణ్ కామెంట్స్ కి బాలయ్య ఘాటుగా కౌంటర్ ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
అప్పట్లో మెగా నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉండేవి. కానీ ఆ విభేదాలు ప్రస్తుతం నెమ్మదిగా తగ్గుతున్నాయనే చెప్పాలి. బాలకృష్ణ చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ కి చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్ బి కె అనే షోకి రామ్ చరణ్ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.