- Home
- Entertainment
- ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీతో ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. అతడు ఇండస్ట్రీకి దొరికిన వరం అంటూ కామెంట్స్
ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీతో ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. అతడు ఇండస్ట్రీకి దొరికిన వరం అంటూ కామెంట్స్
ఒకప్పుడు జెనీలియా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. జెనీలియా పేరు చెప్పగానే బొమ్మరిల్లు చిత్రంలో ఆమె పోషించిన హాసిని పాత్ర గుర్తుకు వస్తుంది. బాయ్స్ చిత్రంతో సౌత్ లోకి అడుగుపెట్టిన జెనీలియా సత్యం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us

జెనీలియా తెలుగు చిత్రాలు
ఒకప్పుడు జెనీలియా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. జెనీలియా పేరు చెప్పగానే బొమ్మరిల్లు చిత్రంలో ఆమె పోషించిన హాసిని పాత్ర గుర్తుకు వస్తుంది. బాయ్స్ చిత్రంతో సౌత్ లోకి అడుగుపెట్టిన జెనీలియా సత్యం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో మెమొరబుల్ హిట్స్ ని జెనీలియా తన ఖాతాలో వేసుకుంది.
సత్యం, రెడీ, ఢీ, బొమ్మరిల్లు లాంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. కానీ జెనీలియాకి స్టార్ హీరోలతో నటించిన ప్రతిసారి నిరాశే ఎదురైంది. జెనీలియా ఎన్టీఆర్ తో నటించిన నా అల్లుడు, సాంబ చిత్రాలు నిరాశపరిచాయి. అదేవిధంగా రామ్ చరణ్ తో నటించిన ఆరెంజ్, అల్లు అర్జున్ తో నటించిన హ్యాపీ మూవీస్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
జూనియర్ చిత్రంతో జెనీలియా రీ ఎంట్రీ
అయితే వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం జెనీలియా మరోసారి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి నటిస్తున్న జూనియర్ చిత్రం జూలై 18న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రలో జెనీలియా మెరిశారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అవుతారని ఊహించలేదు
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జెనీలియా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ముగ్గురు హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు. వారి జర్నీలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అవుతారని అప్పట్లో నేను అసలు ఊహించలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో వాళ్ళ నటన చూశాక వీళ్లతోనేనా నేను నటించింది అని ఆశ్చర్యపోయా.
ఎన్టీఆర్ టాలీవుడ్ కి ఒక వరం
జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. మూడు పేజీల డైలాగ్ ని కూడా సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు. అతడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఒక వరం అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. రామ్ చరణ్ కూడా అమేజింగ్ యాక్టర్. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ నటన చాలా బాగుంది. ఇక అల్లు అర్జున్ ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు. హ్యాపీ మూవీ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ చాలా సరదాగా ఉండేవారు అని జెనీలియా తెలిపింది.
కోట శ్రీనివాసరావుపై ఎమోషనల్ కామెంట్స్
అదేవిధంగా ఇటీవల మరణించిన కోట శ్రీనివాసరావు ని కూడా జెనీలియా గుర్తుచేసుకుంది. కోటా శ్రీనివాసరావు గారి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు జెనీలియా పేర్కొంది. బొమ్మరిల్లు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. అలాంటి నటుడిని ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరమని జెనీలియా తెలిపింది.