Rajamouli-nani:  రాజమౌళి ఇప్పుడు పాన్‌ ఇండియా దర్శకుడు. మహేష్‌ బాబుతో చేయబోయే సినిమాతో ఆయన పాన్‌ వరల్డ్ డైరెక్టర్‌ కాబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆయన తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ పై స్పందించారు. అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చారు. అదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

Rajamouli-nani: రాజమౌళి కెరీర్‌ బిగినింగ్‌ నుంచి తనకు సెట్‌ అయ్యే హీరోలతోనే సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. పరాజయం లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తనతో పని చేసిన ప్రతి హీరో కెరీర్‌ పరంగా నెక్ట్స్ లెవల్ కి ఎదుగుతూ వస్తున్నారు. పాన్‌ ఇండియా హీరోలు అయిపోయారు. అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 

రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్ `మహాభారతం` అప్‌ డేట్‌..

అదే సమయంలో తన రేంజ్‌ని పెంచుకుంటూ వస్తున్నారు రాజమౌళి. ఇండియన్‌ సినిమా రూపురేఖలు మార్చిన ఆయన అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేశారు. మహేష్‌ బాబు సినిమాతో ఆ మార్కెట్‌లో పాగా వేయాలని చూస్తున్నారు.

దీనంతటికి కారణం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్. మహాభారతం తీయాలనేది రాజమౌళి డ్రీమ్‌. దానికోసమే, తన రేంజ్‌ని, మార్కెట్‌ని విస్తరించాలనే ఉద్దేశ్యంతో, ఆ కళాఖండాన్ని తీయడానికి కావాల్సిన అనుభవాన్ని ఆయన ఈ లోపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. 

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ `బాహుబలి 3`నా?

మహేష్‌ బాబుతో సినిమా తర్వాత ఎవరితో ఉంటుందని ఇంకా క్లారిటీలేదు. `బాహుబలి 3` కూడా ఉండబోతుందనే హింట్‌ ఆ మధ్య ఇచ్చారు. ఒకవేళ అదే జరిగితే ఆ తర్వాతనే మహాభారతం ఉండబోతుందనేది చెప్పొచ్చు. అయితే దీనిపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఇందులో కాస్టింగ్ రివీల్‌ చేశారు. నాని తన సినిమాలో ఉండబోతున్నట్టు తెలిపారు. 

రాజమౌళి మహాభారతంలో నాని రోల్‌ ఫిక్స్ 

రాజమౌళి.. నాని హీరోగా నటించిన `హిట్‌ 3` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌లో ఆయన్ని సుమ ప్రశ్నించింది. `మహాభారతం`లో నాని ఉంటున్నారా? అని, అందుకు రాజమౌళి స్పందిస్తూ. ఆ మూవీ ఎప్పుడు వచ్చినా అందులో నాని మాత్రం పక్కా అని చెప్పారు.

అయితే అది ఏ పాత్రలో అనేది మాత్రం చెప్పలేదు. `మహాభారతం`లో మాత్రం నాని నటిస్తాడనే విషయం చెప్పి సినిమాకి హైప్ ఇచ్చారు. ఆ మూవీకి సంబంధించిన ప్లాన్‌లో కూడా రాజమౌళి ఉన్నట్టు దీని బట్టి చూస్తే అర్థమవుతుంది. 

`హిట్‌ 3`తో మే 1న రాబోతున్న నాని

నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన `హిట్‌ 3` మూవీ మే 1న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు నాని. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ,

నాని నుంచి ఇంకా చాలా ఎక్స్ పెక్ట్ చేస్తుంటాం. ఆయన ఏ సినిమా చేసినా అది హిట్‌ అని తెలిసిపోతుంటుంది. కానీ ఇప్పుడు నాని నేను ఆశించిన దానికంటే ఇంకా చాలా ముందుకు వెళ్లిపోయాడు నాని. మేం కోరుకుంటుంటాం. మీరు ముందుకు వెళ్తూనే ఉండండి` అని తెలిపారు జక్కన్న. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. 

read more: సమంత లైఫ్‌ని మార్చేసిన టాప్‌ 10 సినిమాలు, ఆ ఒక్క హీరోతోనే మూడు బ్లాక్‌ బస్టర్స్

also read: 40 ఏళ్ళ క్రితం కమెడియన్ కి తన ఇంట్లో షెల్టర్ ఇచ్చి ప్రోత్సహించిన చిరంజీవి, దశ తిరిగి నవ్వుల రారాజు అయ్యాడు