దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత 'మహాభారతం' సినిమా తీయబోతున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఆయన మాత్రం 'RRR' సినిమా తీస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

మరోపక్క 'మహాభారతం' సినిమాను వేరే భాషల్లో ఇతర దర్శకులు తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అసలు రాజమౌళి 'మహాభారతం' తీస్తాడా..? లేదా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ విషయాలకు తాజాగా జరిగిన 'RRR' మూవీ ప్రెస్ మీట్ లో సమాధానం చెప్పుకొచ్చాడు రాజమౌళి.

'మహాభారతం' సినిమా కచ్చితంగా తీస్తానని.. బాగుసా అదే తన చివరి సినిమా కావొచ్చంటూ బదులిచ్చాడు. ఇక 'RRR' సినిమా గురించి చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజుగా  రామ్ చరణ్, కొమరం భీం గా కనిపించనున్నట్లు వెల్లడించారు. 

బాహుబలి తరువాత గ్రాఫిక్స్ అవసరం లేని సినిమా చేయాలనుకున్నట్లు.. కానీ కుదరడం లేదని, ఈ సినిమాలో కూడా రాజమౌళి మార్క్ క్రియేటివ్ వెపన్స్ చూసే చాన్స్ ఉంటుందని అన్నారు. 

'RRR': చరణ్, తారక్ ల జోడీ వీళ్లే!

నాలుగు వందల కోట్లతో 'RRR'.. రిలీజ్ డేట్ ఇదే!

అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్: రాజమౌళి

మా బంధానికి దిష్టి తగలకూడదు.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను: రామ్ చరణ్