రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తుండడంతో రాజమౌళి స్వయంగా ప్రెస్ మీట్ ని నిర్వహించి సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

1900సంవత్సరంలో జరిగే సంఘటనలతో ఈ సినిమా రూపొందనుందని వెల్లడించారు. అల్లూరి సీతారామారాజు, కొమరం భీం ల పాత్రలను తీసుకొని ఫిక్షన్ జోడించి సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.

భారీ బడ్జెట్ తో సుమారు రూ.350 నుండి 400 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాత దానయ్య తెలిపారు. 2020 జూలై 30 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత అనౌన్స్ చేశారు.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. దాదాపు పది భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. 

అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్: రాజమౌళి

మా బంధానికి దిష్టి తగలకూడదు.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను: రామ్ చరణ్