దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఏదోక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం.

ఇందులో దర్శకుడు రాజమౌళి సినిమాకు సంబంధించి చాలా విషయాలను పంచుకున్నారు. కథ ప్రకారం ఈ సినిమా 1900 సంవత్సరంలో సాగుతుంది. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీం గా కనిపించబోతున్నారు. సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారనే విషయంలో చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

అయితే జక్కన్న స్వయంగా హీరోయిన్ల పేర్లను అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ కి జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కి జోడీగా విదేశీ భామ డైసీ ఎడ్గర్ జోన్స్( Daisy Edgar Jones) కనిపించనున్నారు.

అలియాభట్ సీత పాత్రలో కనిపించనుందని రాజమౌళి వెల్లడించారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ విషయంలో ఆలస్యం జరగదని రాజమౌళి స్పష్టం చేశారు.  

నాలుగు వందల కోట్లతో 'RRR'.. రిలీజ్ డేట్ ఇదే!

అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్: రాజమౌళి

మా బంధానికి దిష్టి తగలకూడదు.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను: రామ్ చరణ్