దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం.

ఈ సందర్భంగా హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''ఇది జక్కన్నతో నాల్గో చిత్రం. స్పెషల్ ఫిలిం గా నా కెరీర్ లో మిగిలిపోతుంది. ఎందుకంటే.. రాజమౌళితో పని చేయడం, చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం. మా బంధం ఇప్పటిది కాదు.. నా కష్టసుఖాలను పంచుకునే మంచి స్నేహితుడు. ఈ సినిమా మేమిద్దరం కలిసి చేసేసరికి మా స్నేహం వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. ఈ స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. మా బంధానికి దిష్టి తగలకూడదు.
అల్లూరి సీతారామారాజు, కొమరం భీం ల గురించి మనకి తెలియని ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి మనకి తెలియని గీత ఒకటి ఉంది. వాళ్లిద్దరూ గనుక కలిసి ఉంటే ఏం జరిగి ఉంటుందనే తాత్పర్యం ఎప్పుడైతే డైరెక్టర్ సీన్ లోకి తీసుకోచ్చారో.. నటుడిగా మాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమా నాకు చరణ్ కి, నటులుగా ఎదగడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ సినిమా కోసం తీసుకున్న శిక్షణ మా భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. ఇది గొప్ప సినిమాగా నిలిచిపోతుందని నా నమ్మకం'' అంటూ చెప్పుకొచ్చారు.  

అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్: రాజమౌళి

మా బంధానికి దిష్టి తగలకూడదు.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను: రామ్ చరణ్

నాలుగు వందల కోట్లతో 'RRR'.. రిలీజ్ డేట్ ఇదే!