దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం.

ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''రాజమౌళి గారితో మరోసారి కలిసి పని చేయాలని అనుకున్నాను. ఇండస్ట్రీలో తారక్ నాకు క్లోజ్ ఫ్రెండ్. తనతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని'' చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయిందో చెబుతూ..  ''ఒకరోజు నేను ఊరికి వెళుతూ వెళ్లే దారిలో రాజమౌళి గారిని కలిశాను. అప్పటికే ఆయన ఇంట్లో తారక్ ఉన్నాడు. కొద్దిసేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. అప్పుడు ఇద్దరినీ సెపరేట్ గా తీసుకెళ్లి సినిమా గురించి చెప్పారు. ఆరోజు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తరువాత ముగ్గురం కలిసి తీసుకున్న ఫొటోనే మీరందరూ చూశారంటూ'' చెప్పుకొచ్చాడు. 

బాధ్యతతో తీసుకున్న కథను అంతే బాధ్యతగా తీసుకొని చేస్తున్నామని, ఇంతకముందు మా కాంబినేషన్ లో సినిమాకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో.. అంతకు మించి ఈ సినిమా ఉంటుందని అన్నారు. 

అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్: రాజమౌళి

మా బంధానికి దిష్టి తగలకూడదు.. ఎన్టీఆర్ కామెంట్స్!