డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోలకు ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకురావడంలో పూరి సిద్ధహస్తుడు. పూరి జగన్నాధ్ మిగిలిన దర్శకులందరి కంటే భిన్నంగా ఉంటారు. అలాగే పూరి జగన్నాధ్ మంచి మనసు ఉండే వ్యక్తి. పలు సందర్భాల్లో ఆ విషయం రుజువైంది. 

ఇటీవల కొంతకాలంగా దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాదిరాళ్లుకు రాజ్ కుమార్ దర్శకుడు. ప్రస్తుతం ఆయన వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఉన్నారు. 

రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు ఆర్థిక సాయం చేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాధ్ రాజ్ కుమార్ గురించి తెలుసుకుని ఆయనకు రూ. 50 వేల డబ్బుని వైద్య ఖర్చులకు సాయం చేశారు. 

చిరంజీవి వచ్చి సాయం చేస్తారని ఎదురుచూపు!

ఇటీవల పూరి జగన్నాధ్ తన బర్త్ డే సందర్భంగా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న 30 మంది దర్శకులకు 50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాజ్ కుమార్ ని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. 

మనం సైతం తరుపున కాదంబరి కిరణ్ రూ 25, మెహర్ రమేష్ రూ10 వేలు ఆర్థిక స్థాయం అందించారు. రాజ్ కుమార్ గురించి తెలిసిన వెంటనే పూరి జగన్నాధ్ స్పందించడంతో సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

పూరీజగన్నాధ్ రీసెంట్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాధ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే మూవీ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.