టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వయసు నలభై కి చేరుకుంటున్నా ఆయన మాత్రం పెళ్లి ఊసెత్తడం లేదు. తన కుటుంబం అతడికి పెళ్లి చేయాలని ఎంతగా ప్రయత్నిస్తోన్న ప్రభాస్ మాత్రం దానికి అంగీకరించడం లేదు. 

అతడి పెదనాన్న కృష్ణంరాజు మాత్రం గత ఇదేళ్ళుగా ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించాల్సి వచ్చిన ప్రతీసారి ఈ ఏడాది చేసేస్తాం అంటూ సమాధానాలు చెబుతున్నాడు. మొదట బాహుబలి సినిమా అయిన తరువాత ప్రభాస్ పెళ్లి జరుగుతుందని అనుకున్నారు కానీ ఆయన వెంటనే 'సాహో' సెట్స్ పైకి వెళ్లిపోయాడు.

కనీసం ఈ సినిమా అయిన తరువాత చేసుకుంటాడనుకుంటే.. మరో సినిమా కూడా ఒప్పుకున్నాడు. ఈ రెండు సినిమాలకు మధ్య గ్యాప్ లో ప్రభాస్ పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి గురించి అతడి తల్లి ఎలాంటి షరతులు విధించలేదు. కానీ ఈసారి మాత్రం ప్రభాస్ కి డెడ్ లైన్ విధించిందని చెబుతున్నారు.

ఎలాగైనా.. వచ్చే ఏడాదిలోగా ప్రభాస్ కి పెళ్లి జరిపించాలని ఆమె ప్లాన్. ఇదే విషయం ప్రభాస్ కి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మరి తల్లి కోరినట్లుగా ప్రభాస్  వచ్చే ఏడాదిలోపు పెళ్లి చేసుకుంటాడో.. లేదో. చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

ప్రభాస్ బర్త్ డే కి అనుష్క స్పెషల్ గిఫ్ట్!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

40లోకి వస్తోన్న ప్రభాస్.. దొరికితే పెళ్లేనట!