ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి 'బిల్లా','మిర్చి','బాహుబలి' వంటి చిత్రాలలో నటించారు. అయితే చాలా రోజులుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఎప్పటికప్పుడు ఈ విషయంపై స్పందిస్తూ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని చెబుతున్నా.. పెళ్లి వార్తలు రావడం మాత్రం మానడం లేదు. ఇది ఇలా ఉండగా.. రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు జరిగింది. అతడి పుట్టినరోజు కానుకగా అనుష్క స్పెషల్ గా డిజైన్ చేయించిన చేతి గడియారాన్ని పంపిందట.

ప్రభాస్ కి వాచ్ లంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో అతడికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వాచ్ ని పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క బరువు తగ్గించుకోవడం కోసం ట్రీట్మెంట్ లో భాగంగా అమెరికాకి వెళ్లింది. మరోపక్క ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.