Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ - కంగనా జోడీ రిపీట్..? పాన్ ఇండియా సినిమాలో ఏక్ నిరంజన్ జంట

కొన్ని కాంబినేషన్లు అంచనాలు మించి ఉంటాయి. సర్ ప్రైజ్ లు ఇస్తుంటాయి. అనుకోకుండా అలా కుదురుతుంటాయి. అలాంటి కాంబినేషనే ప్రభాస్ , కంగనా జోడి. వీరు మరోసారి కలిసి నటించబోతున్నారట. నిజమేనా..? 
 

Prabhas and Kangana Ranaut Jodi once again pan india Movie JMS
Author
First Published Feb 23, 2024, 12:39 PM IST | Last Updated Feb 23, 2024, 12:39 PM IST

ప్రభాస్ -కంగనా రనౌత్.. ఈజోడి గురించి టాలీవుడ్ ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాతో ఇద్దరు ఎంత పాపులర్ అయ్యారో తెలిసిందే. 2009 లో రిలీజ్ అయిన  ఈసినిమాలో ఇద్దరికి ఇద్దరు టెంపర్ క్యారెక్టర్స్.. చేశారు.  ఇద్దరిలో మస్త్ శేడ్స్ కూడా చూపించారు. ఫ్యాన్స్ అయితే ఏక్ నిరంజన్ సినిమా చూసి ఊగిపోయారు. కాని ఈమూవీ పెద్దగా హిట్ కాలేదు. అయినా ఇప్పుడు చూడాలన్నా బోర్ కొట్టకుండా చూసేస్తారు. 

మరి ఇంత అద్భుతమైన కాంబినేషన్ మరోసారి కలిస్తే బాగుండు అనుకున్నారు ఫ్యాన్స్.  కాని అసలు అది జరుగుతుందో లేదో అని డౌట్ ఉండేది. కాని ప్యాన్స్ కు ఈ విషయంలో గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత మరోసారి వీరిద్దరు కలిసి నటించనున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలున్న సినిమాల్లో కన్నప్ప ఒకటి. టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీతో టాలీవుడ్ ను మరో మెట్టు ఎక్కించాలని చూస్తున్నారు మంచు ఫ్యామిలీ. 

Prabhas and Kangana Ranaut Jodi once again pan india Movie JMS

అయితే ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నట్టు తెలిసిందే. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యింది. అలాగే శివయ్య భక్తుడు కన్నప్ప పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది… అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ చాలామంది నటిస్తుండగా.. వారి గురించి ఇంకా క్లారిటీ రావల్సి ఉంది.  అయితే తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం..ఈ మూవీలో పార్వతి దేవి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కనిపించనుందని టాక్.

కుర్చీ మడతపెట్టేసిన జపాన్ జంట, మహేష్ బాబు పాటతో ఇచ్చిపడేశారుగా..?

శివుడిగా ప్రభాస్ నటిస్తుండగా..ప్రభాస్ సరసన పార్వతి దేవిగా కంగనా కనిపించనుందని అంటున్నారు. అయితే ఈవిషయం లో అధికారిక ప్రకటన రాలేదు కాని.. ఇందులో ఎంతవరకు నిజమనేది మూవీ టీమ్ నుంచి  క్లారిటీ రావల్సి ఉంది. కన్నప్ప సినిమాలో కంగనా అది కూడా ప్రభాస్ సరసన నటించబోతోంది అని వార్త వైరల్ అవుతుండగా.. ఇండస్ట్రీలో ఇది సంచలనం గా మారింది. 

రాజకీయాల్లోకి నిహారిక.. మెగాస్టార్ నిలిచి గెలిచిన స్థానం నుంచి మెగా డాటర్ పోటీ..?

ఇక కన్నప్ప సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు తెలుగు అడియన్స్ కూడా  ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దూరదర్శన్ లో ప్లే అయిన  మహాభారతం సీరియల్  ను రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా.. ఇందులో ఇండియాలోని దిగ్గజ నటులంతా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో పాటు  సూపర్ స్టార్ మోహన్ లాల్ లాంటి వారు అతిథి పాత్రలలో కనిపించనున్నారు. 

దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో కన్నప్ప సినిమా రూపొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios