కుర్చీ మడతపెట్టేసిన జపాన్ జంట, మహేష్ బాబు పాటతో ఇచ్చిపడేశారుగా..?
గుంటూరు కారం మ్యానియా ఏమాత్రం తగ్గడం లేదు. సినిమా సంగతి పక్కన పెడితే.. సాంగ్ మాత్రం దూసుకుపోతోంది. ఇండియాలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఈ పాట ఊపు కొనసాగుతోంది.
టాలీవుడ్ నుంచి ఎన్నో పాటలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్అయ్యాయి. ఎన్నో తెలుగు పాటలు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది హాలీవుడ్ స్టార్స్ కూడా మన టాలీవుడ్ సాంగ్స్ కు స్టెప్పులేస్తూ..సందడి చేసిన వారు ఉన్నారు. ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాల సాంగ్స్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంటూ వచ్చాయి. ఈక్రమంలోనే ఎన్నో పాటలు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక టాలీవుడ్ లో మరోసాంగ్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకుంది.
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ మన తెలుగు రాష్ట్రాల తెలుగు ఆడియన్స్ ని మాత్రమే కాకుండా.. దేశ వ్యాప్తంగా రచ్చ చేస్తోంది. ఆమధ్య మన ఇండియాన్ సెలబ్రిటీలు చాలామంది ఈ సాంగ్ కు స్టెప్పులేసి అలరించారు. ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా తన భార్య.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఈసాంగ్ కు అదరిపోయే స్టెప్పులేశారు.
రాజకీయాల్లోకి నిహారిక.. మెగాస్టార్ నిలిచి గెలిచిన స్థానం నుంచి మెగా డాటర్ పోటీ..?
ఇక ఇప్పుడు హాలీవుడ్ ఆడియన్స్ ను కూడా ఉర్రూతలూగిస్తోంది మడతపెట్టి సాంగ్ . ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది. ఇక తాజాగా ఒక జపాన్ జంట.. ఈ పాటకి మహేష్ బాబు, శ్రీలీల వేసిన స్టెప్స్ ని రీ క్రియేట్ చేస్తూ చేసిన రీల్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. తెలుగు మాస్ సాంగ్ కి జపాన్ జంట వేసిన స్టెప్పులు అదరిపోయేలా ఉన్నాయి. ఈ వీడియో చూసిన టాలీవుడ్ ఆడియన్స్.. ‘జపాన్ జంట స్టెప్పులతో ఇచ్చిపడేశారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా తన గ్రేస్ తో అమ్మాయి బాగా డాన్స్ వేసిందంటూ పేర్కొంటున్నారు. మరి ఆ జపాన్ జంట వేసిన ఆ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.రీసెంట్ గా ఇటీవల కొందరు ఫారినర్స్ తమ జిమ్ వర్క్ అవుట్స్ కోసం ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ని ఉపయోగించుకుంటూ కసరత్తులు చేస్తున్న వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో పై మహేష్ బాబు కూడా రియాక్ట్ అవుతూ స్టోరీ పెట్టడం విశేషం.