రాజకీయాల్లోకి నిహారిక.. మెగాస్టార్ నిలిచి గెలిచిన స్థానం నుంచి మెగా డాటర్ పోటీ..?
మెగా డాటర్ నిహారిక కొనిదెల పొలిటికల్ ఎంట్రీ..? అంతే కాదు తన పెదనాన్న పోటీ చేసి గెలిచిన స్థానం నుంచే ఆమె కూడా నిలబడుతుందట. ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న వార్త ఇదే. ఈ వార్తల్లో నిజం ఎంత..?
Niharika Konidela
నిహారిక కొణిదెల... మెగా డాటర్ ఇమేజ్ తో పాటు.. ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ ను కూడా బిల్డ్ చేసుకుంది. హోస్ట్ గా, హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా.. ఇలా రకరకాల క్యారెక్టర్స్ ను ఆమె టాలీవుడ్ లో పోషించింది. ఇక జొన్నలగడ్డ చైతన్యతో పెళ్ళి తరువాత ఇండస్ట్రీకి దూరం అయిన నిహారిక... విడాకులు తరువాత మళ్లీ టాలీవుడ్ లో యాక్టీవ్ అయ్యింది.
Photo Courtesy: Instagram
సినిమా కెరీర్ అంతగా సక్సెస్ అవ్వలేదు.. అటు మ్యారేజ్ లైఫ్ కూడా ఫెయిల్ అవ్వడంతో.. నిహారికి చాలా కాలం డిస్సపాయింట్ లో ఉండిపోయింది. ఆతరువాత టాలీవుడ్ లో యాక్టీవ్ అవుతోంది బ్యూటీ.. అయితే ఇప్పటి వరకూ నిహారిక గురించి వినిపించని ఓ కొత్త వార్త తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. నిహారిక పొలిటికల్ ఎంట్రీ.
Niharika Konidela
ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల పరంగా కొత్త కొత్త మార్పులు, చిత్రవిచిత్ర విన్యాసాలు చాలా జరుగుతాయి అది కామన్. ఈక్రమంలోనే ఓ ఆసక్తికర విషయం ప్రచారంలోకి వచ్చింది. మెగాబ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని.. అంతే కాదు ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నాగబాబు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ కూతురు కొణిదెల నిహారిక 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతుందని.. అది కూడా కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న తిరుపతి నుంచి.. ఆమె పోటీకి దిగుతున్నారని.. వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిజం ఎంత.. ? ఆమె నిజంగా నిలబడుతుందా అనే విఫయంపై.. టాలీవుడ్ హీరో.. నిహారిక అన్న వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో రాష్ట్రమంతా ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నాడు వరుణ్. ఇక ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రి పర్యటించారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ వచ్చే ఎన్నికల్లో ప్రచారం, తన కుటుంబ సభ్యుల పోటీపై క్లారిటీ ఇచ్చారు.
ఇక తిరుపతి నుంచి నిహారిక పోటీ చేస్తుందని ఎవరు చెప్పారో కానీ.. అది అవాస్తవం. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు అన్నారు. అప్పటి వరకూ వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టేశారు వరుణ్. ఈ వార్తలను ఆయన కొట్టిపడేశారు. ఇవి రూమర్స్ గా స్టార్ట్ అయినా.. అది జరిగి ఉంటే బాగుండు అనుకుంటున్నారు మెగా ప్యాన్స్. ఈ విషయంలో కాస్త డిస్సపాయింట్అయ్యారు. మెగా ఫ్యామిలీ నుంచి మగవారేయాక్టీవ్ గా ఉన్నారు. ఆడవారు రంగంలోకి దిగాలి. నిహారిక పోటీ చేసి ఉంటే బాగుండేది అని అభిప్రాయ పడుతున్నారు.
వరుణ్ తేజ్ ఇంకా ఏమన్నారంటే..? ఎన్నికలు అనేది చాలా సున్నితమైన అంశం.. ఎన్నికల్లో పోటీ గురించి కుటుంబ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మేం దాన్ని ఫాలో అవుతాం. ఎవరెన్ని విషయాలు మాట్లాడినా.. ఫైనల్ గా కుటుంబంలోని పెద్దదే తుది నిర్ణయం.
పెదనాన్న, నాన్న, బాబాయ్ ఏది చెబితే తాము అంతా పాటిస్తాం. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయమంటే చేస్తాం.. అనకాపల్లి నుంచి నాన్న తరుపు నుంచి ప్రచారం చేసే విషయంలో పెద్దవాళ్లు ఎలా చెబితే అలా నడుచుకుంటాను. అన్నారు.