Asianet News TeluguAsianet News Telugu

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ మద్దతు.. ‘విక్రాంత్ రోణ’పై ప్రశంసల వర్షం..

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తాజాగా అడ్వెంచర్ ఫిల్మ్ ‘విక్రాంత్ రోణ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు కిచ్చా సుదీప్ ను అభినందిస్తున్నారు. 
 

Power star Pawan Kalyan Fans congratulates Kannada star Kiccha Sudeep, Appreciation on Vikrant Rona Movie
Author
Hyderabad, First Published Jul 30, 2022, 6:21 PM IST

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) - దర్శకుడు అనూప్ బండారి కాంబినేషన్ లో వచ్చిన అడ్వెంచర్ ఫిల్మ్ ‘విక్రాంత్ రోణ’(Vikrant Rona). మూవీలో  జాక్వెలిన్ పెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నిరూప్ బండారి, నీత అశోక్ ఇతర కీలక రోల్స్ చేశారు. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ ఈ విజువల్ వండర్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సంగీత దర్శకుడు బి అంజనీష్ లోకనాథ్ అద్భుతమై మ్యూజిక్ అందించిన ఈ చిత్రం రెండు రోజుల కిందనే థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ నే  సొంతం చేసుకుంటోంది. 

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘విక్రాంత్ రోణ’పై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అలాగే విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుదీప్ ను అభినందించినట్టు సమాచారం. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కిచ్చా సుదీప్ ను, విక్రాంత రోణ చిత్రానికి మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో సినిమా విజయవంతం అంటూ సుదీప్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ పరిశ్రమలో భారీ చిత్రాలు తెరకెక్కుతుండటం విశేషం. ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా ఫిల్మ్ గానే  రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ కు నచ్చే సినిమాలను తీస్తున్నారు. అలాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిందే విక్రాంత్ రోణ అని చెప్పవచ్చు. ప్రస్తుతం సినిమాపై యూత్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇటు ఇండస్ట్రీలోని పలువురు కూడా సినిమాపై, కిచ్చా సుదీప్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ గానీ, ఆయన అభిమానులు కూడా చిన్న సినిమాలను, ఇతర భాషా చిత్రాలకు మద్దతుగా నిలుస్తుండటం విశేషం.

 

Follow Us:
Download App:
  • android
  • ios