దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి నియోజక వర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీకి దిగుతున్న క్రమంలో సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తనదైన రీతిలో స్పందించారు. 30 ఏళ్ల అనుబంధంలో హరికృష్ణ నాకు ఎన్నో విషయాలు చెప్పారని అన్నారు. 

మీ తండ్రి హరికృష్ణను చంద్రబాబు ఎన్ని సార్లు మోసం చేశారో మీ కుటుంబానికి తెలియదా అంటూ సుహాసినిని ప్రశ్నించారు. తండ్రిని అవమానించిన అవకాశవాది ఆదేశిస్తే కూటమి అభ్యర్ధిగా కూకట్ పల్లి నుండి ఎలా పోటీకి దిగుతున్నారని ఫైర్ అయ్యారు. అమాయకురాలైన సుహాసినిని చంద్రబాబు రోడ్ మీదకి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

''ఆమె గెలిచినా, ఓడినా అవమానమే.. చంద్రబాబు మాయలో పడి కమ్మ సెంటిమెంట్ తీసుకొస్తే తెలంగాణా వాళ్లు స్థానిక సెంటిమెంట్ తీసుకొస్తే ఇక్కడ ఆంధ్రావాళ్లు సంతోషంగా బతకగలరా.? ఓటు అనేది నిజాయితీగా వెయ్యాలి.. కమ్మ కోణంలో ఓటు వేయొద్దు.. ఇక్కడి ఆంధ్రావాళ్లంతా అన్నదమ్ముల్లా కలిసిపోయారు.

కూకట్ పల్లిలో ఎక్కువగా కమ్మవాళ్లు ఉన్నారనే సుహాసిని చంద్రబాబు అభ్యర్ధిగా ప్రకటించారు తప్ప ప్రజలకు సేవ చేద్దామని కాదు. ఓటు వేసేప్పుడు కులాన్ని బట్టి కాదు గుణాన్ని బట్టి వేయాలి. సుహాసిని ఎంతమందికి తెలుసు. ఎన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు'' అంటూ పోసాని ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.   

read more news

సుహాసినీ కోసం.. రంగంలోకి ఎన్టీఆర్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి