Asianet News TeluguAsianet News Telugu

పుట్టిన రోజున పవన్ తన ఫ్యాన్స్ కు ఇచ్చే గిప్ట్ ఇదే

సెప్టెంబ‌ర్ 2న ఆయన పుట్టిన‌ రోజు వేడుక జరుపుకోనున్న నేపథ్యంలో ఆ రోజు ఏమి గిప్ట్ ఇవ్వబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.  ఆ రోజున టీజర్ వస్తుందా,ట్రైలర్ వస్తుందా లేక బ్రాండ్ న్యూ పోస్టర్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

Pawan Kalyan s Birthday gift to fans
Author
Hyderabad, First Published Aug 9, 2021, 4:51 PM IST

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ ఏ రేంజిలో హంగామా చేస్తారో తెలిసిందే ఈ పుట్టిన రోజుకి ఇంకా చాలా రోజుల సమయం ఉండగా ఆ పండుగ కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబ‌ర్ 2న ఆయన పుట్టిన‌ రోజు వేడుక జరుపుకోనున్న నేపథ్యంలో ఆ రోజు ఏమి గిప్ట్ ఇవ్వబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.  ఆ రోజున టీజర్ వస్తుందా,ట్రైలర్ వస్తుందా లేక బ్రాండ్ న్యూ పోస్టర్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ రోజు ఏమి రాబోతోంది అంటే..

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఆయన తాజా చిత్రం  ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్ కు సంభందించిన ఓ పాటను విడుదల చేయనున్నారు. అది చాలా స్టన్నింగ్ గా ఉండబోతోందని వినికిడి. ఇనిస్టింట్ ఛాట్ బస్టర్ అవుతుందని దర్శక,నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమన్ ఇప్పటికే ఆ పాటను స్వరపరిచారని వినికిడి. ఆ రోజంతా ఆ పాట  వైరల్ అవుతూనే ఉంటుందని భావిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. మలయాళంలో బిజుమేనన్‌, పృథ్వీరాజ్‌లు పోషించి పాత్రలను తెలుగులో పవన్‌కల్యాణ్‌, రానా పోషిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం పూర్తి కాగా, త్వరలో షూటింగ్ పూర్తి టైటిల్ ప్రకటన చేయనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.    

 దీనిపై చిత్ర టీమ్ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అంతేకాదండోయ్‌ ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం. దీనిని పురస్కరించుకుని పవన్ అభిమానులు సరికొత్త ట్రెండ్ ను సోషల్ మీడియాలో సెట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. పవనోత్సాహం అనే హాష్ టాగ్ వైరల్ చేస్తున్నారు. ఇదే తరుణంలో పవన్ కల్యాణ్ తన జన్మదినోత్సవం నాడు దగ్గుబాటి రాణా తో చేస్తున్న మల్టీ స్టారర్ మువీ టీజర్, అదే విధంగా హరిహర వీరమల్లు మువీకి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ రిలీజ్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభమయ్యే మువీ ఫస్ట్ లుక్ తో టైటిల్ తో కూడిన పోస్టర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios