పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ అడ్వంచర్ మూవీ 'హరి హర వీరమల్లు. అభిమానుల కోసం ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. అదేంటంటే?

దాదాపు నాలుగైదేళ్లుగా పెండింగ్ లో పడిన హరిహరవిరమల్లు సినిమా ప్రస్తుతం పరుగులు పెడుతోంది. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈమూవీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే స్పీడ్ గా జరుగుతున్నాయి. వరుస వాయిదాల తర్వాత చివరకు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. 

హరి హర వీరమల్లు VFX పనులు పూర్తి

క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసిన ఈమూవీ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ చేతిలోకి వెళ్ళింది. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది.

తాజాగా, ఈ చిత్రానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు పూర్తి అయ్యాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటోను షేర్ చేసింది. రెండున్నర సంవత్సరాలకు పైగా ఈ సినిమాపై తమ VFX బృందం అంకితభావంతో పని చేసిందని వెల్లడించింది.

విజ్యువల్ వండర్ కాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా

నిర్మాణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమా విజ్యువల్ వండర్ కాబోతోంది. ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని అందించబోతోంది. ప్రతి సన్నివేశంలోనూ అత్యున్నత స్థాయి VFX ను వాడినట్టు తెలుస్తోంది. .ఇంతవరకూ తెలుగు సినిమాల్లో ఎన్నడూ చూడని విజువల్స్‌ను హరిహర వీరమల్లు సినిమా ద్వారా అందించబోతున్నాం అని మూవీ టీమ్ పేర్కొంది.

Scroll to load tweet…

హరి హర వీరమల్లు రిలీజ్ ఎప్పుడంటే 

ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా పూర్తయిన విషయం తెలిసిందే. ఇప్పుడు VFX పనులు పూర్తయ్యాయి దాంతో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటికే ఈ చిత్రం అనేకసార్లు వాయిదా పడిన నేపథ్యంలో, అభిమానులు ఈసారి ఎట్టకేలకు థియేటర్లలో చూడాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఈసినిమా స్పెషల్ కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు పవన్. చారిత్రక నేపథ్యం, గ్రాండ్ మేకింగ్, ప్రత్యేకంగా రూపొందించిన యాక్షన్ సీన్స్ , ఇవన్నీ హరిహర వీరమల్లు ప్రత్యేకంగా నిలిపాయి. తాజాగా పూర్తి చేసిన VFX పనులు ఈ అంచనాలను మరింత పెంచుతున్నాయి. సినిమా విడుదల తేదీపై త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.