ఏకంగా 29 ఆపరేషన్లు చేయించుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? నిజం ఎంత?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ గ్లామర్ కోసం సర్జరీలు చేయించుకోవడం చాలా కామన్. అందం కోసం ఒకటీ రెండు సర్జరీలు అయితే ఏమో కానీ.. ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం ఏకంగా 29 ఆపరేషన్లు చేయించుకుందట. ఇంతకీ ఎవరా హీరోయిన్?

సినిమా స్టార్స్ అంటే అందంగా కనిపించాలి, హీరోలు సిక్స్ ప్యాక్ తో, హీరోయిన్లు జీరో ప్యాక్ తో కనిపించాలని వారి ఫ్యాన్స్ కోరకుంటుంటారు. అయితే స్టార్స్ తమ గ్లామర్ ను కాపాడుకోవడం కోసం ఏదో ఒక సర్జరీ చేయించుకోవడం కామన్ గా మారింది ఈరోజుల్లో. ముక్కు,ముఖం, లిప్స్ ఇలా ఒకటేంటి అందంకోసం చాలా సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఈక్రమంలో ఓ హీరోయిన్ ఇలా అందం కోసం ఏకంగా 29 సర్జరీలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు దివంగత తార శ్రీదేవి.
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతిలోక సుందరి బిరుదు సాధించి, అందం, అభినయంతో అత్యద్భుతం చేసిన నటి శ్రీదేవి. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కోట్లాది మందిని ఆకట్టుకున్నారు. నటిగా ఎదగడానికి శ్రీదేవి చాలా కష్టపడ్డారు. శ్రీదేవి జీవితంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. తాజాగా ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీదేవి తన అందాన్ని కాపాడుకోవడం కోసం జీవితం మొత్తం లో 29 శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందాన్ని మెరుగుపరిచే చికిత్సల్లో లేజర్ స్కిన్ సర్జరీ, సిలికాన్ బ్రెస్ట్ ట్రీట్మెంట్, ఫేస్ లిఫ్ట్ వంటి పద్ధతులు ఉన్నట్లు సమాచారం. ఆమె మరణానికి కొద్ది రోజుల ముందు లిప్ సర్జరీ కూడా చేయించుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
1950లో శివకాశి సమీప గ్రామంలో జన్మించిన శ్రీదేవి, బాలనటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ప్రధాన ఇండస్ట్రీలలో అద్భుతం చేశారు. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు శ్రీదేవి. 1980లలో ఆమె క్రేజ్ ఎంతలా ఉండేదంటే స్టార్ హీరోలకు సమానంగా శ్రీదేవిని ట్రీట్ చేసేవారు. హీరో అయినా , దర్శకుడైనా, నిర్మాత అయినా ఎవరైనా శ్రీదేవి డేట్స్ కోసం ఎదురు చూసేవారు.
శ్రీదేవి నటించిన సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించేది. శ్రీదేవి సినిమా అనౌన్స్ అయిన దగ్గరి నుంచి భారీ బిజినెస్ జరగేది. స్టార్ హీరోలకు మాత్రమే లభించే హడావుడిని, ఫాలోయింగ్‌ను శ్రీదేవి హీరోయిన్ గా అందుకున్నారు. శ్రీదేవి నటన ఎంత అద్భుతం అంటే... ఆమె తెరపై కనిపించే ప్రతి సన్నివేశాన్ని ఓ విజువల్ వండర్ గా మలిచేది.
ఇక తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేయాలి అనుకున్నారు శ్రీదేవి. కాని జాన్వీని హీరోయిన్ గా చూడకుండానే కన్ను మూశారు. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆమె మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కానీ ఆమె సినీ ప్రస్థానం, త్యాగాలు అభిమానుల గుండెల్లో శ్రీదేవికి చెరగని స్థానం కలిపించాయి.