టాలీవుడ్‌ లో తిరుగులేని ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్, తిరిగి సిల్వర్‌ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్‌ లో బ్లాక్‌ బస్టర్ హిట్‌ అయిన పింక్‌ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు పవన్‌. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

పవన్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో పవన్‌ బర్త్‌ డే కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. ఏకండా నెలన్నర ముందు నుంచే హడావిడి ప్రారంభించారు. సెప్టెంబర్ 2న పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు. అయితే ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు పవన్‌ అభిమానులు. హ్యాపీ బర్త్‌ డే పవన్‌ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ఓ రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

మామూలు రేంజ్‌లో కాదు ఏకంగా నేషనల్‌ లెవల్‌ రికార్డ్‌ను క్రియేట్ చేశారు పవన్‌ ఫ్యాన్స్‌. 24 గంటల్లో ఈ హ్యాష్ ట్యాగ్‌ 27.3 మిలియన్స్‌ ట్వీట్స్ వచ్చాయి. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంత గ్యాప్ తరువాత కూడా పవన్ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గకపోవటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.