టాలెంట్ ఉన్నవారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని మరో సారి రుజువైంది. తాజా సమాచారం మేరకు సుధీర్ బాబు తన తదుపరి చిత్రం పలాస దర్శకుడు కరుణ కుమార్ తో ప్లాన్ చేస్తునట్టు వినికిడి. శ్రీకాకుళం బార్డర్ `పలాస` నేపథ్యంలో అదిరిపోయే నేటివిటీతో సినిమా తీసి మెప్పించిన కరుణ కుమార్, ఆ తర్వాత మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. రెండు ప్రాజెక్టులు కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా, మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపధ్యంలో  కరుణ కుమార్ తను తయారు చేసిన కథను సుధీర్ బాబుకు చెప్పి ఓకే చేయించుకున్నారని తెలిసింది. 

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబును కొత్తగా చూపించబోతున్నాడని తెలుస్తుంది. అదే విధంగా సరికొత్త యాసను మాట్లాడతాడని తెలుస్తోంది. సుధీర్ బాబు ఈ మధ్యనే వి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.`వి` చిత్రానికి మిశ్రమ స్పందనలు వ్యక్తమవగా సుధీర్ బాబు కాప్ రోల్ కి మాత్రం మంచి పేరొచ్చింది. ఈ సినిమా లో సుధీర్ బాబు యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. 

ఇక సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో యాక్ట్ చేయాల్సి ఉండగా అది జనవరిలో మొదలవనుంది. ఈ బయోపిక్ కి దర్శకుడు ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే ఈ సినిమా పై పూర్తి సమాచారం రానుంది.