Asianet News TeluguAsianet News Telugu

'సాహో' కి టైమ్ కలిసొచ్చింది, టాకే తేడా కొడుతోంది

భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో టాక్  వచ్చేసింది. సినిమా తేడా అని తేలిపోయింది. అయితే రిలీజ్  పరంగా సాహో కి మంచి టైమ్ సెట్టైంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు విడుదలైన సాహో చిత్రానికి సోమవారం వినాయక చతుర్థి సెలవు కలుపుకొని మొత్తం నాలుగు రోజుల కంటిన్యూ వీకెండ్ కలిసొచ్చింది. దానికి తోడు  వచ్చే వారం కూడా పెద్ద సినిమాల విడుదల లేదు. 

One More weekend plus to Saaho movie?
Author
Hyderabad, First Published Aug 30, 2019, 3:12 PM IST

భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో టాక్  వచ్చేసింది. సినిమా తేడా అని తేలిపోయింది. అయితే రిలీజ్  పరంగా సాహో కి మంచి టైమ్ సెట్టైంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు విడుదలైన సాహో చిత్రానికి సోమవారం వినాయక చతుర్థి సెలవు కలుపుకొని మొత్తం నాలుగు రోజుల కంటిన్యూ వీకెండ్ కలిసొచ్చింది. దానికి తోడు  వచ్చే వారం కూడా పెద్ద సినిమాల విడుదల లేదు.  కేవలం సెప్టెంబర్ 6న ఆది సాయి కుమార్ నటించిన జోడి తో పాటు ఉండిపోరాడే అనే మరో చిన్న చిత్రం విడుదల అవుతున్నాయి. 

సాహోకి ఈ రెండు చిత్రాలు  ఏమాత్రం పోటీకాదు కాబట్టి మరో వారం సోలో వీకెండ్ కలిసొచ్చినట్లే లెక్క. కాబట్టి సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ విడుదల అయ్యేవరకు సాహో కి తెలుగులో పోటీ ఇచ్చే సినిమానే లేదు. అయితే ఇంతలా టైమ్ కలిసొచ్చినా సినిమాకు టాక్, సినిమాలో కథ కలిసి రాకపోవటంతో ఎంతవరకూ ఇది సాహోకు ప్లస్ అవుతుందనేది డౌట్ గా మారింది.  సాహో టాక్ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చిన వసూళ్ల వర్షం కురిసేది, కానీ ఇప్పుడు యావరేజ్ నుంచి డిజాస్టర్ వైపుగా టాక్ ప్రయాణం పెట్టుకోవటం మాత్రం చాలా ఇబ్బందికరం.  

హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా, ట్విస్ట్ లు అండ్ యాక్షన్ లాంటి అంశాలు ఆకట్టుకున్నా.. కథ పరంగా సినిమాలో ఎలాంటి కొత్తధనం లేకపోవటం, బోరింగ్ స్క్రీన్ ప్లే సినిమాని దెబ్బ కొట్టాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్ , అంతకు మించి బోరింగ్ ట్రీట్మెంట్ , ట్విస్ట్ లు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. దర్శకుడు ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన విజువల్స్ తో నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను బాగా స్లోగా  నడిపారు. అలాగే సెకెండ్ హాఫ్  బాగా దారుణం.   స్క్రీన్ ప్లే ‘బి.సి’ సెంటర్ ఆడియన్స్ కి కూడా అర్ధమయ్యేలా ఇంట్రస్టింగ్ గా ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి వర్కవుట్ అయ్యి ఉండి ఉండేది. 

ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios