నివేదా థామస్‌(Nivetha thomas) పంచుకున్న ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అందుకు కారణం ఆమె ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించిన ఫోటోని పంచుకోవడమే. 

క్యూట్‌ అందాలతో, అద్భుతమైన నటనతో మెస్మరైజ్‌ చేస్తుంది హీరోయిన్‌ నివేదా థామస్‌(Nivetha Thomas). సిల్వర్‌ స్క్రీన్‌పై కనువిందు చేసే ఈ అందాల భామ ఇప్పుడు ఏకంగా అతిపెద్ద శిఖరంపై కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. ఉన్నట్టుండి తాను పర్వత అధిరోహకురాలిగా మారిపోయి షాకిచ్చింది. తాజాగా Nivetha Thomasపంచుకున్న ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అందుకు కారణం ఆమె ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో(Kilimanjaro) పర్వాతాన్ని అధిరోహించిన ఫోటోని పంచుకోవడమే. 

హీరోయిన్‌గా మెప్పించే నివేదా థామస్‌కి సాహసాలు ఇష్టమట. ఎత్తైన శిఖరాలను అధిరోహించడం వంటి సాహసాలు చేయడమంటే మరింత ఇష్టమట. అయితే తనకు ఎప్పటి నుంచి Kilimanjaro Mountain పర్వాతాన్ని అధిరోహించాలనే కోరిక ఉండిపోయింది. దాన్ని ఎట్టకేలకు నెరవేర్చుకుంది నివేదా థామస్‌. దీని కోసం ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో శిక్షణ తీసుకుని, తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఎంతటి రిస్కైనా భరించి తాను అనుకున్నది సాధించింది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది అందరి చేత ప్రశంసలందుకుంటుంది.

Scroll to load tweet…

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది నివేదా థామస్‌. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనా ఫ్రీగా నిల్చొనే మౌంటేన్‌ కిలిమంజారోపై నేను. ఫైనల్‌గా దీన్ని సాధించాను` అని పేర్కొంది నివేదా. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. నివేదాకి ఆమె అభిమానులతోపాటు సినీ ప్రముఖులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. ఇటీవల `వకీల్‌సాబ్‌`లో కీలక పాత్రలో మెప్పించింది నివేదా థామస్‌. ఇందులో అద్భుతమైన నటనతో మెప్పించింది. 

aslo read: నభా నటేష్ కిరాక్ హాట్ షో.. ఎద అందాలతో మెస్మరైజింగ్ ఫోజులు

ప్రస్తుతం నివేదా థామస్‌.. `మీట్‌ క్యూట్‌` చిత్రంలో నటిస్తుంది. దీనికి నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు `షాకిని దాకిని` అనే మరో సినిమాలో నటిస్తుంది. `జెంటిల్‌మేన్‌`, `నిన్నుకోరి`, `జై లవ కుశ`, `118`, `బ్రోచేవారెవరురా`, `వీ`, `దర్భార్‌` వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

also read: రాజీనామాలపై త్వరలోనే నిర్ణయం: ‘‘మా’’ కార్యవర్గ సమావేశంలో మంచు విష్ణు వ్యాఖ్యలు