రాజీనామాలపై త్వరలోనే నిర్ణయం: ‘‘మా’’ కార్యవర్గ సమావేశంలో మంచు విష్ణు వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (movie artists association) ‘‘మా’’ (maa ) కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. రాజీనామా చేసిన సభ్యులందరి పత్రాలు అందాయన్నారు. రాజీనామాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంచు విష్ణు స్పష్టం చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (movie artists association) ‘‘మా’’ (maa ) కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. రాజీనామా చేసిన సభ్యులందరి పత్రాలు అందాయన్నారు. రాజీనామాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంచు విష్ణు స్పష్టం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాధ్యతలు చేపట్టాక తన అజెండాలో పెట్టుకున్న ఓ పని చేయబోతున్నామన్నారు. నటీనటులను అసభ్యకరంగా చూపిస్తూ మాట్లాడే కొన్ని య్యూట్యూబ్ ఛానల్స్‌పై కఠిననమైన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు హెచ్చరించారు. మాకూ కుటుంబం వుందని.. శివబాలాజీ (shiva balaji) చెప్పినట్లు వారు ఏదో తంబ్‌నైల్స్ పెట్టేసి హద్దు మీరుతున్నారని ఆయన మండిపడ్డారు. లోపల మేటర్ ఏమీ వుండదని.. కానీ మహిళా నటీమణులకు నష్టం జరుగుతుందని అలాంటి వారిపై చర్యలు మొదలుపెట్టామని విష్ణు తెలిపారు.
ఎక్కడికి పోతారు.. ఎలా తప్పించుకుంటారు.. తాను లీగల్‌గా ఓ టీమ్‌తో మాట్లాడానని విష్ణు వెల్లడించారు . దానికోసమే ఓ సెల్ పెట్టి, ఎల్లో జర్నలిజం చేసిన వారిపై చర్య తీసుకుంటామన్నారు. మహిళలను తల్లితో సమానంగా చూడాలని, గౌరవించాలని ఆయన హితవు పలికారు. ఏ య్యూట్యూబ్ ఛానల్ అయినా నటీనటులపై అసభ్యకరంగా చిత్రిస్తే ఊరుకోమని.. అందుకు ఫిలిం క్రిటిక్స్, జర్నలిస్టులు కూడా మాకు సహకరించాలి అని మంచు విష్ణు కోరారు.
అంతకుముందు 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలిసారి పవర్ ఫుల్ డెసిషన్ తీసుకున్నారు. 'మా'లో మహిళా భద్రత, సాధికారతను పెంచేందుకు ఓ కమిటీని నియమించబోతున్నట్లు Manchu Vishnu ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ కమిటీకి 'వుమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్'(WEDC) అని పేరు పెట్టారు. MAA లో WEDC కమిటీని ఏర్పాటు చేయడం గర్వంగా ఉంది అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈ కమిటీకి సామజిక కార్యకర్త సునీతా కృష్ణన్ గౌరవ సలహాదారుగా ఉంటారని విష్ణు పేర్కొన్నాడు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తా అని విష్ణు పేర్కొన్నాడు. 'మా'లో మహిళా సభ్యులని పెంచే దిశగా పనిచేస్తాం. అందులో WEDC తొలి అడుగు అని విష్ణు పేర్కొన్నాడు.
కాగా, అక్టోబర్ 10న జరిగిన 'మా' ఎన్నికల్లో విష్ణు ప్రకాష్ రాజ్ పై 107 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. విష్ణు ప్యానల్ లో ఎక్కువమంది సభ్యులు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో కూడా కొందరు సభ్యులు విజయం సాధించినప్పటికీ.. Mohan Babu తమని దుర్భాషలాడారనే కారణంగా వారంతా మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డ సంగతి తెలిసిందే.