నితిన్‌కు వరుస పరాజయాలు ఎదురవుతున్న ఈ సమయంలో, త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రమైనా నితిన్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నితిన్‌కు వరుస పరాజయాలు ఎదురవుతున్న ఈ సమయంలో, త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రమైనా నితిన్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నితిన్ గత చిత్రం ‘రాబిన్‌హుడ్’ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా విఫలమైంది. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం ‘తమ్ముడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా చిత్ర బృందం ఒక ప్రభావవంతమైన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో కథానాయకుడు నితిన్ కీలక పాత్రలో కనిపించడంతోపాటు, ప్రొఫెషనల్ ఆర్చర్ పాత్రలో దర్శనమిచ్చాడు. ఈ మోషన్ పోస్టర్‌కు అజనీష్ లోకనాథ్ అందించిన నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నితిన్ విలుకాడిగా ఎవరిపై బాణాలు సంధించబోతున్నాడు, ఆ పోరాటాలు ఎలా ఉంటాయి అనేది చిత్రంలో ఆసక్తికరం కానుంది.
వకీల్ సాబ్‌కు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్, ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో లయ, సప్తమి గౌడ, ‘లబ్బర్ పాండూ’ ఫేమ్ స్వాసిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కథను పరిశీలిస్తే, ఇది ఒక సోదరుడు తన సోదరిని రక్షించేందుకు చేయగలిగిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తూ ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో రూపొందింది. భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని బృందం భావిస్తోంది.
చిత్ర ప్రమోషన్స్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టు బృందం తెలిపింది. ‘తమ్ముడు’ సినిమాను 2025 జూలై 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.