- Home
- Entertainment
- హీరోయిన్ ని కాలేకపోయినందుకు చాలా బాధపడ్డా.. కాస్టింగ్ కౌచ్, ట్రోలింగ్ పై అనసూయ కామెంట్స్
హీరోయిన్ ని కాలేకపోయినందుకు చాలా బాధపడ్డా.. కాస్టింగ్ కౌచ్, ట్రోలింగ్ పై అనసూయ కామెంట్స్
అనసూయ భరద్వాజ్ మొదట బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత టాలీవుడ్ లో సంచలన నటిగా మారింది. అనసూయ అంటే ఎక్కువగా ఆమె గ్లామర్, వివాదాలు యువతకి గుర్తుకు వస్తాయి.

Anasuya Bharadwaj
అనసూయ భరద్వాజ్ మొదట బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత టాలీవుడ్ లో సంచలన నటిగా మారింది. అనసూయ అంటే ఎక్కువగా ఆమె గ్లామర్, వివాదాలు యువతకి గుర్తుకు వస్తాయి. బుల్లితెరపై అనసూయ జబర్దస్త్ లాంటి షోలలో యాంకర్ గా రాణించారు. టీవీ యాంకర్స్ లో గ్లామర్ తో అనసూయకు వచ్చినంత క్రేజ్ మరెవరికి రాలేదు అంటే అతిశయోక్తి కాదు.
అనసూయ నటిగా కూడా విజయవంతమైన చిత్రాల్లో నటించింది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయ కి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై టీవీ కార్యక్రమాలు చేస్తూనే నటిగా కూడా రాణిస్తున్నారు. అనసూయ తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఎంతలా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అనసూయ గ్లామర్ ఫోటోస్ కి యువత ఫిదా అవుతుంటారు. మరికొందరు మాత్రం ఆమె గ్లామర్ షో ని ట్రోల్ చేస్తుంటారు. అనసూయ కి ట్రోలర్స్ కి మధ్య చాలా సార్లు వివాదం ముదిరింది. కొందరు నెటిజన్లు అనసూయని ఆంటీ అని సోషల్ మీడియాలో కామెంట్ చేయడంతో ఘాటుగా బదులిచ్చింది. తనని ఎందుకు అలా పిలుస్తున్నారో అర్థం కావడం లేదని అనసూయ మండిపడింది.
ఓ ఇంటర్వ్యూలో తాను గ్లామర్ ప్రదర్శించడం, పొట్టి బట్టలు ధరించడం గురించి అనసూయ నెటిజన్లకు, ట్రోల్ చేసేవారికి క్లారిటీ ఇచ్చింది. తనకి నచ్చిన బట్టలు ధరించే హక్కు ఉందని.. తన బట్టలు తన ఇష్టం అని అనసూయ ఘాటుగా స్పందించింది. తనపై ఎంతలా ట్రోలింగ్ జరుగుతున్నా అనసూయ మాత్రం గ్లామర్ హీట్ తగ్గించడం లేదు.
తాజాగా అనసూయ కలర్ ఫుల్ గా కనిపించే లెహంగా అవుట్ ఫిట్ లో ఫోజులిచ్చింది. దీంతో మరోసారి అనసూయ గ్లామర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.
అనసూయ చివరగా పుష్ప 2, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది. తనకి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ సంఘటనలు కూడా ఎదురయ్యాయని అనసూయ పేర్కొంది. కొందరు అగ్ర హీరోలు, ఇతర దర్శకులు తనని కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇబ్బంది పెట్టారని.. తాను వాళ్లకి నో చెప్పడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని అనసూయ పేర్కొంది.
చాలా మంది మీరు హీరోయిన్ ఎందుకు కాలేదు అని అడుగుతుంటారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ అందులో ఒక కారణం. ఇటీవల కొంతమంది హీరోయిన్లు చేసిన పాత్రలకు నేను సరిపోతాను. కానీ నాకు అవకాశం రాలేదు. హీరోయిన్ ని కాలేకపోయినందుకు చాలా సందర్భాల్లో డిప్రెషన్ ఫీల్ అయ్యా. కానీ ప్రస్తుతం తనకి వస్తున్న అవకాశాలతో హ్యాపీగా ఉన్నట్లు అనసూయ పేర్కొంది.