బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో రెండు వారాలు గడచిపోయాయి. ప్రస్తుతం మూడవ వారం జరుగుతోంది. రెండు ఎలిమినేషన్స్ కూడా జరిగాయి. కింగ్ నాగార్జున ఇది సభ్యులతో కూల్ గా మాట్లాడుతున్నాడు. ఇకపై అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. హౌస్ లో సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువవుతున్నాయి. గ్రూపులుగా మారి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. నాగార్జునలో యాంగ్రీ యాంగిల్ బయటపడే సమయం వచ్చింది. 

ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌస్ లో హాట్ హాట్ గా ఉండబోతోంది. తప్పులు చేసిన ఇంటి సభ్యులని కడిగిపారేసేందుకు నాగ్ సిద్ధం అవుతున్నారు. శనివారం రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని స్టార్ మా రిలీజ్ చేసింది. శనివారం రోజు అలీ రెజాపై నాగార్జున ఒక రేంజ్ లో విరుచుకుపడబోతున్నట్లు ఈ ప్రోమో ద్వారా అర్థం అవుతోంది. 

ఇటీవల హౌస్ లో ముగిసిన దొంగతనం టాస్క్ లో అలీ రెజా, హిమజ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో తనని క్షమించమని హిమజ అలీ కాళ్లపై కూడా పడింది. ఈ విషయంలో నాగార్జున ఆలీకి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నాడు. అలీ.. నీ డ్రెస్ సెన్స్ బావుంది. కానీ కామన్ సెన్స్ లేదేంటయా నీకు.. ఆడపిల్లతో ప్రవర్తించేది అలాగేనా అంటూ నాగార్జున అలికి వార్నింగ్ ఇస్తున్నాడు. మిగిలిన వారి పట్ల కూడా నాగార్జున ఎలా స్పందించాడో తెలియాలంటే శనివారం జరగబోయే ఎపిసోడ్ చూడాలసిందే.