నాగ్ హోస్టింగ్ తో బిగ్ బాస్ 3 హౌజ్ రోజురోజికి ఊహించని పరిణామాలతో వేడెక్కుతోంది. కంటెస్టెంట్స్ లో తొలి వారం హేమ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.  హేమ స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వగా అందరూ ఊహించినట్టుగానే ఆమె ఎలిమినెట్ అయ్యారు. బిగ్ బాస్ లో ఇది మూడవ ఎలిమినేషన్.

గతవారం జాఫర్ విడుకోలు పలికిన విషయం తెలిసిందే. ఇక హౌజ్ నుంచి తమన్నా సింహాద్రి బయటకు వెళ్ళేటప్పుడు కంటెస్టెంట్స్ తో చిందులు వేస్తున్నట్లే కనిపించినా కాస్త ఎమోషనల్ అవుతూ వెళ్లారు. ఇక ఎలిమేనేషన్ లిస్ట్ లో మొదట పునర్నవి, వితిక, బాబా మాస్టర్, తమన్నా ఉండగా..మొదట పునర్నవి సేఫ్ జోన్ లోకి వచ్చింది. తరువాత షోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కమెడియన్ వెన్నెల కిషోర్ ముగ్గురిలో ఒక కంటెస్టెంట్ ని సేవ్ చేశాడు. 

చివరి నిమిషం వరకు కాస్త టెన్షన్ కి గురి చేసిన వెన్నెల కిషోర్ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చి బాబా మాస్టర్ ని సేవ్ చేశారు. ఆ తరువాత వితిక, తమన్నా ఇద్దరిలో ఒకరు ఎలిమినెట్ అయినట్లు నాగార్జున తెలిపారు. ఫైనల్ గా తమన్నా ఎలిమినెట్ అవ్వడంతో హౌజ్ కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. అయినప్పటికీ తమన్నా బయటకు నవ్వుతూనే వచ్చారు. 

అందరిని పలకరించుకుంటు వెళ్లిన తమన్నా రవి కలవడానికి వచ్చినా మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. అందరికి గురించి మాట్లాడుతూ .. బాబా భాస్కర్ ఒక్కరు తనకు ఎంతో సపోర్ట్ చేశారని ఆమె ఎమోషనల్ అయ్యారు.