నర్తనశాల ట్విట్టర్ రివ్యూ

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 30, Aug 2018, 10:33 AM IST
nartanasala movie twitter review
Highlights

ఛలో సినిమాతో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో.. తాజాగా నర్తనశాల సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న యువ కథానాయకుడిలో నాగశౌర్య కూడా ఒకరు. ఇటీవల ఛలో సినిమాతో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో.. తాజాగా నర్తనశాల సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీనివాస్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాశ్మీర, యామిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. కొందరు ఔత్సాహికులు ట్విట్టర్ ద్వారా  సినిమా ఎలా ఉందో ట్వీట్ చేస్తున్నారు. వారి ట్వీట్ల ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ప్రేక్షకుల ట్వీట్ల ప్రకారం.. హీరో నాగశౌర్య నటనపరంగా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. కామెడీ నేపథ్యంలో సినిమా తెరకెక్కినప్పటికీ.. ఆ కామెడీ ట్రాక్ సరిగా వర్కౌట్ కాలేదేమో అనిపిస్తోంది. అవసరం లేని చోట కామెడీ ని బలవంతంగా ఇరికించినట్లు గా ఉంది. శావాజీరాజీ కామెడీ కూడా చాలా ఓవర్ గా ఉంది. ఫస్టాఫ్ తో పోలిస్తే.. సెకండ్ ఆఫ్ బెటర్ గా ఉంది అంటూ ప్రేక్షకులు ట్వీట్ చేస్తున్నారు. ఇక పూర్తి రివ్యూ రావాలంటే మాత్రం మరికొంత సేపు ఆగాల్సిందే. 

ఇవి కూడా చదవండి...

రివ్యూ: ఆటగాళ్ళు

రివ్యూ: నీవెవరో

రివ్యూ: గీత గోవిందం

loader