గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని తన ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. నాని మాట్లాడుతూ.. 11 ఏళ్ల క్రితం వైజాగ్ లోనే తన కెరీర్ మొదలైందని నాని తెలిపాడు. 

నాతొలి చిత్రం అష్టాచమ్మా ప్రీమియర్ షోని వైజాగ్ లోనే మొదటి ప్రదర్శించారు. ఆ తర్వాత 11 ఏళ్ళు ఇలా గడచిపోయాయి. మళ్ళీ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతోంది. మనవాళ్ళు పాటలు చిత్రీకరించేందుకు ఎక్కడెక్కడికో విదేశాలకు వెళుతుంటారు. కానీ వైజాగ్ ని మించిన అందం ఎక్కడైనా ఉంటుందా అని నాని అన్నాడు. 

మనం చిత్రం తర్వాత నుంచి విక్రమ్ కుమార్ తో కలసి సినిమా చేయాలని అనుకుంటున్నా. అది ఇప్పటికి కుదిరింది. భవిష్యత్తులో విక్రమ్ కుమార్ తో కలసి మరిన్ని చిత్రాలు చేస్తా. వైదిస్ కొలవెరి సాంగ్ తో అనిరుధ్ ప్రపంచం మొత్తాన్ని ఊపేశాడు. అతడితో ఒక్క సినిమా అయినా చేయాలనీ అనుకున్నా. అలాంటిది ఇలా వరుసగా జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు. 

హీరోయిన్ ప్రియాంక గురించి మాట్లాడుతూ.. పిల్ల బాగుందా అని ఆడియన్స్ ని నాని అడిగాడు. ప్రేక్షకుల నుంచి పెద్దఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ప్రతి సినిమాలో హీరోయిన్లని పరిచయం చేయడం నాకో జాబ్ లాగా అయిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కూడా భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటిస్తానని నాని తెలిపాడు. 

గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్: చిరంజీవి, రవితేజ.. మా జనరేషన్ కు నాని!

గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్: ఆ టైంలో నాని చెప్పిన మాట ఎప్పటికి మరచిపోలేను!

'గ్యాంగ్ లీడర్' ప్రీరిలీజ్ ఈవెంట్: నాని లాంటి నటుడుండడం అదృష్టం!