గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం వైజాగ్ లో వైభవంగా జరిగింది. చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రసంగిస్తూ ఈ చిత్రం కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఏఈ సినిమా ప్రారంభానికి ముందు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో నాని నాతో చెప్పిన మాట ఎప్పటికి మరచిపోలేను. 

విక్రమ్.. ఏం జరిగినా నీతో నేను సినిమా చేస్తా అని అన్నాడు. నాని అద్భుతమైన నటుడు. అంతకకన్నా మంచి స్నేహితుడు అని విక్రమ్ కుమార్ ప్రశంసించాడు. హీరోయిన్ ప్రియాంక కూడా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుందని విక్రమ్ తెలిపాడు. సంగీత దర్శకుడు అనిరుద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 

తన బ్యాగ్రౌండ్ సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. ఆ విషయాన్ని మీరంతా సెప్టెంబర్ 13న గమనిస్తారు. ఇక ఈ చిత్రంలో విలన్ గా నటించిన ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయని కూడా విక్రమ్ కుమార్ ప్రశంసించాడు. కార్తికేయ కాకుండా మరెవరూ నటించినా ఆ పాత్రకు తగిన న్యాయం జరిగేది కాదు. కార్తికేయకు మంచి భవిష్యత్తు ఉంది. అతడి నుంచి అద్భుతమైన చిత్రాలు మనం చూస్తాం అని విక్రమ్ తెలిపాడు. 

'గ్యాంగ్ లీడర్' ప్రీరిలీజ్ ఈవెంట్: నాని లాంటి నటుడుండడం అదృష్టం!