గ్యాంగ్ లీడర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటించాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కార్తికేయ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రావాలనే ఆలోచన కలిగినప్పుడు నాకు కొన్ని పేర్లు కనిపించాయి. బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వారు ఎవరు అని చూస్తే.. చిరంజీవి.. రవితేజ లాంటి పేర్లు కనిపిస్తాయి. వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతోంది. 

మా జనరేషన్ లో ఎవరున్నారు లాంటి వారు అని చూస్తే కనిపించే పేరు నేచురల్ స్టార్ నాని. ఎంత స్టార్ గా ఎదిగినప్పటికీ తాను నమ్మిన కథలే చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయనతో కలసి నటించడం జీవితంలో గుర్తుండిపోయే మెమొరీ అని కార్తికేయ తెలిపాడు. 

విక్రమ్ కుమార్ సర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో ఉన్న దర్శకులదంతా ఓ దారి అయితే అయన మాత్రం మరో దారిలో వెళుతూ విజయాలు అందుకుంటున్నారు. ఆయన దర్శకత్వంలో నటించడం వల్ల నా నటన మెరుగుపడింది. ఇక మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రాల్లో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఆ జాబితాలోకి గ్యాంగ్ లీడర్ చిత్రం చేరబోతోంది అని కార్తికేయ తెలిపాడు. 

గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్: ఆ టైంలో నాని చెప్పిన మాట ఎప్పటికి మరచిపోలేను!

'గ్యాంగ్ లీడర్' ప్రీరిలీజ్ ఈవెంట్: నాని లాంటి నటుడుండడం అదృష్టం!