ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి నటించడం నానికి అలవాటు. అందుకే టాలీవుడ్ లో నేచురల్ స్టార్ అయ్యాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ నానిపై ప్రశంసలు కురిపించాడు. గ్యాంగ్ లీడర్ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. విక్రమ్ కుమార్ ప్రతిభ గురించి మీ అందరికి తెలుసు. ఇక నేచురల్ స్టార్ నాని గురించి చెప్పనవసరం లేదు. వారిద్దరి కలయికలో వస్తున్న చిత్రమే ఇది. 

జెర్సీ చిత్రాన్ని మీరంతా చూశారు.. ఎంజాయ్ చేశారు. ఆనాని నటనకు నేను కూడా ఫిదా అయ్యా. ఈ గ్యాంగ్ లీడర్ చిత్రం జెర్సీకి పూర్తిగా భిన్నమైనది. పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుంది. ఈ చిత్రంలో పెన్సిల్ పార్థసారధిగా నాని నటనని మీరంతా ఎంజాయ్ చేస్తారు అని అనిరుద్ తెలిపాడు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో నాని లాంటి నటుడు ఉండడం అదృష్టం అని అనిరుద్ తెలిపాడు. తాను వేరే రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ నా తొలి చిత్రం అజ్ఞాతవాసి నుంచి ఆదరిస్తున్నారని అనిరుధ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.