దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని మహాకూటమిలో భాగంగా టీడీపీ కూకట్ పల్లి అభ్యర్ధిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమె తప్ప విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

ఆమె రాజకీయాల్లోకి రావడంపై కొందరు విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు మాత్రం తమ మద్దతుని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా సినీ నటుడు జగపతి బాబు.. సుహాసినికి మద్దతు తెలిపారు.

'సుహాసిని ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి. ప్రజలను నిబద్దతతో సేవ చేయగలదని నేను నమ్ముతున్నాను. కూకట్ పల్లి అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న ఆమెను  ఆ నియోజక వర్గ ఓటర్లు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నట్లు' ఆయన వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా.. రీసెంట్ గా జగపతిబాబు.. చంద్రబాబు నాయుడిని కలవడంతో ఆయన కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను  జగపతిబాబు ఖండించకపోవడం గమనార్హం. 

read more news

సుహాసిని.. మా చెల్లిలాంటిది.. ప్రత్యర్థి కృష్ణారావు

సుహాసినీ కోసం.. రంగంలోకి ఎన్టీఆర్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి