బిగ్ బాస్ (Bigg boss telugu) హోస్ట్ గా నాగార్జున సూపర్ సక్సెస్. ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా నడిపించారు. నాగార్జున సారథ్యంలో సీజన్ 3,4,5 భారీ టీఆర్పీ దక్కించుకున్నాయి. ఈ జోరులో బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జునతో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు.  

త్వరలో బిగ్ బాస్ ఓటిటి ఫార్మాట్ ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ కార్యక్రమానికి వేడుక కానుంది. హిందీలో ఇప్పటికే ఓటిటి బిగ్ బాస్ ప్రసారమై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నాగార్జున (Nagarjuna)తో తెలుగులో ఓటిటి బిగ్ బాస్ స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన నేడు జరిగింది. హోస్ట్ స్టార్ ప్రతినిధులతో పాటు నాగార్జున ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రెస్ మీట్ నిర్వహించారు వివరాలు పంచుకున్నారు. 

ఇక బిగ్ బాస్ షో తెలుగులో అతిపెద్ద విజయం సాధించిందని, దాదాపు ఆరు కోట్ల మంది బిగ్ బాస్ షో వీక్షిస్తున్నారని నాగార్జున ఈ సందర్భంగా తెలిపారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ షో కారణంగా తమ జీవితాలు మారిపోయాయని, ఛాలెంజ్ లు ఎదుర్కొంటూ విజయం సాధిస్తున్నామని తనతో చెప్పారని నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. హోస్ట్ బాధ్యతలు తీసుకోవడం అంటే కొంచెం భయంగా ఉంటుంది. అయితే షో స్టార్ట్ అయ్యాక నేను కూడా ప్రేక్షకుడిగా మారిపోయి ఎంజాయ్ చేశాను అన్నారు. 

Also read షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్?... సంచలనంగా సోషల్ సోషల్ మీడియా పోస్ట్స్...!
ఇక బిగ్ బాస్ ఓటిటి ఫార్మాట్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందని నాగార్జున తెలియజేశారు. ఎంత మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారు. ఎన్ని రోజులు, గేమ్స్, టాస్క్... ఇలాంటి అనేక విషయాలు చర్చించి రూపొందించాల్సి ఉంది. ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని నాగార్జున తెలిపారు. ఇక టెలివిజన్ కంటెంట్ విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఇది ఓటిటి కావడం వలన రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువ.దీనితో మితిమీరిన మసాలా కంటెంట్ ఉండే ఆస్కారం కలదు. 

Also read RRR movie: ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ రెమ్యూనరేషన్స్ లీక్... ఎవరికెక్కువ తక్కువెవరికి?