- Home
- Entertainment
- RRR movie: ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి... ఆర్ ఆర్ ఆర్ రెమ్యూనరేషన్స్ లీక్, ఎవరికెక్కువ ఎవరికి తక్కువ?
RRR movie: ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి... ఆర్ ఆర్ ఆర్ రెమ్యూనరేషన్స్ లీక్, ఎవరికెక్కువ ఎవరికి తక్కువ?
మూడేళ్ల శ్రమ, 200 రోజులకు పైగా షూటింగ్, గాయాలు, వళ్ళు హూనం అయ్యేలా యాక్షన్ సీక్వెన్స్ లు. ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కష్టం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఒక పట్టాన సంతృప్తి చెందని దర్శకుడు రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఇద్దరికీ నరకం చూపించాడు. పాత్రలకు అనువైన శరీర ఆకృతి కోసం కఠిన కసరత్తులు చేయించారు.

రాజమౌళి మూవీ కోసం హీరోలు కాంప్రమైజ్ కాకుండా కష్టపడతారు. కారణం... కెరీర్ లో ఓ బెస్ట్ హిట్ ఆయన ఇస్తారు. సదరు హీరో పేరిట ఇండస్ట్రీ రికార్డ్స్ నమోదు అయ్యేలా మరపురాని విజయాన్ని అందిస్తారు. అందుకే అనేక కష్టనష్టాలకోర్చి ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ కష్టపడ్డారు. సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దడం కోసం హీరోలతో సమానంగా జక్కన్న కూడా కష్టపడ్డారు.
అనేక ఒత్తిళ్లు, అవరోధాలను ఎదిరించి ఆర్ ఆర్ ఆర్ ని విడుదలకు సిద్ధం చేశారు. మరి ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం తమ రక్తం, స్వేదం చిందించిన హీరోలకు రెమ్యూనరేషన్ గా ఎంత దక్కింది. ఈ ప్రశ్న అభిమానుల మెదడులను తొలిచేస్తుండగా.. పరిశ్రమ నుండి విశ్వసనీయ సమాచారం అందుతుంది.
ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఎన్టీఆర్ తన రెమ్యునరేషన్ గా రూ. 45 కోట్లు తీసుకున్నారట. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్. గతంలో ఆయన రూ. 30-40 కోట్లు తీసుకునేవారు. ఆర్ ఆర్ ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన ఎన్టీఆర్ అంత రెమ్యునరేషన్ దక్కించుకున్నారు.
ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరిగా శత్రువులపై వీరవిహారం చేయనున్న చరణ్ (Ram Charan)కూడా ఎన్టీఆర్ తో సమానంగా రెమ్యూనరేషన్ అందుకున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. చరణ్ సైతం ఆర్ ఆర్ ఆర్ మూవీకి రూ. 45 కోట్లు పారితోషికం రాబట్టారట. చరణ్ కెరీర్ లో కూడా ఇదే అత్యధిక రెమ్యునరేషన్.
ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత కథలో కీలక రోల్ చేస్తన్నారు అజయ్ దేవ్ గణ్. ఎక్కువ నిడివి గలిగిన పాత్ర చేస్తున్న అజయ్ దేవ్ గణ్ రూ... 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట.
ఇక ఆర్ ఆర్ ఆర్ లో ప్రధాన హీరోయిన్ గా, రామ్ చరణ్ ప్రేయసి సీత పాత్ర చేస్తున్న అలియా భట్ రెమ్యూనరేషన్ అదే స్థాయిలో ఉంది. అలియా భట్.. ఆర్ ఆర్ ఆర్ లో నటించేందుకు రూ. 9 కోట్ల ఒప్పందం చేసుకున్నారట. సమంత, రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ రెమ్యూనరేషన్ కి ఇది మూడు రెట్లు అధికం.
ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ రాజమౌళి (Rajamouli)రెమ్యునరేషన్ సింహ భాగం అని తెలుస్తుంది. ఆయన ఆర్ ఆర్ ఆర్ లాభాల్లో 30% షేర్ రెమ్యూనరేషన్ గా తీసుకుంటారట. వందల కోట్ల వసూళ్లు టార్గెట్ గా విడుదలవుతున్న ఆర్ ఆర్ ఆర్ లాభాలు అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి.. రాజమౌళి రెమ్యునరేషన్ వంద కోట్లకు పైమాటే.
Also read RRR Movie Promotions: ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రామ్ చరణ్ పప్పి
Also read RRR promotions: యథా రాజా తథా ప్రజా.. రాంచరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్