బిగ్ బాస్ 3లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో కంటెస్టెంట్ మహేష్ విట్టా. యూట్యూబ్ తో పొందిన క్రేజ్ తో నటుడిగా మారాడు. బిగ్ బాస్ సీజన్ 3లో అవకాశం దక్కించుకున్నాడు. మహేష్ వైఖరి ఇంతవరకు ఎవరికీ అర్థం కావడం లేదు. న మాటతీరు, ఉండే విధానం ఇంతే అంటూనే వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. 

వరుణ్ సందేశ్- వితిక జంటతో మహేష్ కు జరిగిన గొడవ హౌస్ లో హీట్ పెంచేసింది. వితిక మహేష్ అమర్యాదగా ప్రవర్తించాడని వరుణ్ సందేశ్ గొడవకు దిగాడు. అనేక చర్చల తర్వాత వరుణ్ సందేశ్ మహేష్ కు క్షమాపణ తెలిపాడు. కాగా శనివారం ఎపిసోడ్ లో నాగార్జున దాదాపుగా అందరిని టచ్ చేశారు. 

మహేష్ ని కర్రోడా అన్నందుకు రవికృష్ణకు, ఓవర్ యాక్షన్ చేస్తున్న హేమకు వార్నింగ్ ఇచ్చాడు. మంచి పేరు తెచ్చుకుంటున్న పునర్నవి, హిమజ లని ప్రశంసించాడు. బిగ్ బాస్ హౌస్ లో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహితులుగా మారిపోయిన జాఫర్, బాబా భాస్కర్ ని కూడా నాగ్ ప్రశంసించాడు. 

అందరిని టచ్ చేసిన నాగ్ మహేష్ ని మాత్రం వదిలేశాడు. మహేష్ , వితిక మధ్య జరిగిన వివాదం చాలా సీరియస్. బహుశా ఆదివారం రోజు మహేష్ కు నాగార్జున గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

తీన్మార్ సావిత్రి వెనుక విషాదం.. భర్త గురించి చెప్పి కంటతడి పెట్టించింది!

బిగ్ బాస్ నుంచి 'హేమక్క' అవుట్.. పరోక్షంగా పంచ్ వేసిన నాగ్!

బిగ్ బాస్ 3: ఎలిమినేషన్ నుండి ఆ ఇద్దరూ సేఫ్!