కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో తొలివారం పూర్తికావచ్చింది. ఆదివారం జరగబోయే ఎపిసోడ్ తో ఫస్ట్ ఎలిమినేషన్ కూడా పూర్తవుతుంది. తొలి వారంలో నాగార్జున తన హోస్టింగ్ తో ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. నాగార్జున తనదైన శైలిలో జోకులు పేల్చుతూ.. అవసరమైనప్పుడు వార్నింగ్లు ఇస్తూ చాలా హుందాగా షోని నడిపిస్తున్నాడు. 

శనివారం రోజు ముగిసిన షోలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి వారం ఎలిమినేట్ అయ్యేందుకు జాఫర్, హేమ, హిమజ, పునర్నవి, రాహుల్, వితిక నామినేట్ అయ్యారు. కాగా శనివారం రోజు నాగార్జున పునర్నవి, హిమజ సేఫ్ అవుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హిమజ, పునర్నవికి అభిమానులు బాగా పెరుగుతున్నారు. వీరిద్దరికి మద్దతుగా అభిమానుల కామెంట్స్ కనిపిస్తున్నాయి. 

ఇక నామినేషన్ లో మిగిలింది.. జాఫర్, హేమ, రాహుల్, వితిక.. వెరీ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపైఊహాగానాలు మొదలయ్యాయి. నమోదైన ఓటింగ్ సరళి, అభిమానుల్లో ఉన్న వ్యతిరేకతని బట్టి చూస్తే ఇంటి సభ్యులంతా అక్కా అని పిలుచుకునే హేమ హౌస్ నుంచి బయటకు రావడం ఖాయమని అంటున్నారు. ఇంటి నుంచి హేమనే సాగనంపుతారా లేక మరేదైనా ఆశ్చర్యకర నిర్ణయం ఉందా అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వేచి చూడాలి. నాగార్జున కూడా హేమపై వేసిన ఓ పంచ్ ఆసక్తిని రేపుతోంది. 

ఇంట్లో డామినేట్ చేయడానికి నియత్నించావు.. నిన్ను నామినేషన్ లో పెట్టేశారు అంటూ హేమ కిచెన్ లో చేసిన హంగామాని నాగార్జున పరోక్షంగా ప్రస్తావించాడు. ఇప్పటికే హేమ నేను వెళ్ళిపోతే మీరే వంటలు బాగా చేసుకోవాలి అని ఓదార్పులు కూడా ప్రారంభించింది. 

బిగ్ బాస్ 3: ఎలిమినేషన్ నుండి ఆ ఇద్దరూ సేఫ్!