తీన్మార్ వార్తలతో హుషారుగా కనిపించే శివజ్యోతి(సావిత్రి) మనందరికీ తెలుసు. కానీ ఆమె వెనుక కూడా ఓ విషాదం, కుటుంబ సమస్యలు ఉన్నాయి. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ షోలో ఇంటి సభ్యుల మధ్య వివాదాలు జరిగుతున్నప్పటికీ కొంతమంది సన్నిహితంగా మెలుగుతున్నారు. ఒకరికొకరు తమ వ్యక్తిగత విషయాలని ఇంటి సభ్యులతో పంచుకుంటున్నారు. 

శనివారం జరిగిన ఎపిసోడ్ లో శివజ్యోతి అందరిని కంటతడి పెట్టించింది. శివ జ్యోతి పడ్డ కష్టాల గురించి వింటున్న అషురెడ్డి కూడా ఏడ్చేసింది. 19 ఏళ్లకే ఇంటినుంచి బయటకు వచేశానని శివజ్యోతి తెలిపింది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో అనేక సమస్యలు ఎదుర్కొన్నా. ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ కు వచ్చా. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోలేదు. 

మా అన్న హైదరాబాద్ లోనే ఉంటున్నా పట్టించుకోలేదు. తన భర్తే తనకు హాస్టల్ ఫీజు పంపించాడని తెలిపింది. ఎలాంటి ఉద్యోగం లేకుండానే నా భర్తనంను ఒకటిన్నర సంవత్సరం పోషించాడు. ఈ బాధలతో మా ఆయన పరీక్షలో తప్పాడు. ఇక నేను ఖాళీగా కూర్చుకుంటే చిన్న ఉద్యోగం చేయడం ప్రారంభించా. 

అలా ఈ స్థాయికి వచ్చానని శివజ్యోతి తెలిపింది. తన సక్సెస్ వెనుక ఉంది తన భర్త మాత్రమే అని శివజ్యోతి తెలిపింది. ఇలా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతుండగా అషురెడ్డి కంటతడి పెట్టుకుంది. 

బిగ్ బాస్ నుంచి 'హేమక్క' అవుట్.. పరోక్షంగా పంచ్ వేసిన నాగ్!

బిగ్ బాస్ 3: ఎలిమినేషన్ నుండి ఆ ఇద్దరూ సేఫ్!