బిగ్ బాస్ సీజన్ 3 గత ఆదివారం నాడు మొదలైన సంగతి తెలిసిందే. షో మొదలై రేపటికి వారం రోజులు పూర్తి కానుంది. శనివారం నాడు ఎపిసోడ్ లో నాగార్జున ఎనర్జిటిక్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం ఎలిమినేషన్స్ ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయింది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు బాత్ టబ్ లో రొమాంటిక్ ముచ్చట్లు మొదలుపెట్టారు వరుణ్, వితికాలు.

ఇక హౌస్ లో తనదైన శైలిలో బాబా భాస్కర్ తో కలిసి కామెడీ పంచుతున్న జాఫర్ హౌస్ లో కన్నీళ్లు పెట్టుకోవడం ఇంటి సభ్యులతో పాటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యపడ్డారు. తన భార్య గుర్తుకురావడంతో.. వెక్కి వెక్కి ఏడ్చేశారు జాఫర్. శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్ లు జాఫర్ ని ఆ మూడ్ ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉండగా.. తీన్మార్ సావిత్రి తన ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది.

19 ఏళ్ల వయసులో ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్న తనను తన భర్త ఎంతో బాగా చూసుకున్నారని.. ప్రతి విషయంలో తనను బాగా సపోర్ట్ చేస్తారని ఇలాంటి మంచి భర్త ప్రతీ అమ్మాయికి రావాలని కోరుకుంటూ ఏడ్చేసింది. ఇక నాగార్జునని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తోన్న కంటెస్టెంట్స్ కి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో కంటెస్టెంట్ తో చనువుగా, పాజిటివ్ అంశాలను మాత్రమే చర్చించారు.

ఇక ఈ వారం కీలకమైన ఎలిమినేషన్ లో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు డేంజర్ జోన్ లో ఉండగా.. ఈ ఆరుగురిలో సేవ్ అయిన తొలి కంటెస్టెంట్ హిమజ అంటూ నాగ్ చెప్పడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. వెంటనే ఎమోషనల్ అయిన హిమజ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక మిగిలిన ఐదుగురులో పునర్నవి సేఫ్ జోన్ లో ఉన్నట్లు నాగ్ తెలిపారు. మిగిలిన వారిలో రాహుల్, వితికా, జాఫర్, హేమలు ఎలిమినేషన్ లో ఉండిపోయారు. వీరిలో  ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్కరు ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే!