మెగాబ్రదర్ నాగబాబు తనకు బాలకృష్ణ ఎవరో తెలియదని చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియా వర్గాల్లో జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ విషయంపై నందమూరి అభిమానుల నుండి వ్యతిరేకత రావడంతో వారికి చురకలు అంటించడానికి అన్నట్లు నాగబాబు మరో వీడియో విడుదల చేస్తూ.. బాలకృష్ణ మంచి కమెడియన్ అంటూ సీనియర్ నటుడు వల్లూరి బాలకృష్ణ గురించి మాట్లాడారు.

దీంతో నందమూరి అభిమానులు మరింతగా రెచ్చిపోతున్నారు. నాగబాబుని టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్న బాలయ్య అభిమానుల దృష్టి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పై పడింది.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'అంతరిక్షం' సినిమా ఈ నెల 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్ లోకి రానివ్వమని, విడుదలను అడ్డుకుంటామని కొన్ని జిల్లాలకు చెందిన నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్లు హెచ్చరిస్తున్నాయి.

'అంతరిక్షం' సినిమా ఎలా విడుదలవుతుందో చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. ఒకవేళ విడుదల చేసినా.. నెగెటివ్ టాక్ తో సినిమాను దెబ్బ కొడతామని అంటున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు పెడుతున్నారు. 

పవన్ మూడు పెళ్లిళ్లు.. నాగబాబు ఏం అంటున్నాడంటే..?

పవన్ తో మహేష్ ని పోల్చిన నాగబాబు!

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?