Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ ఫ్యాన్స్ కు నాగబాబు విన్నపం, అదరిపోయేలా అన్నయ్య బర్త్ డే వేడుకలు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు దగ్గర పడుతుంది. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా సరిగ్గా జరగని బర్త్ డే వేడుకలను అదిరిపోయేలా నిర్వహించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు.

Naga Babu Direction for Megastar Birthday Events
Author
Hyderabad, First Published Aug 18, 2022, 8:21 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు దగ్గర పడుతుంది. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా సరిగ్గా జరగని బర్త్ డే వేడుకలను అదిరిపోయేలా నిర్వహించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు.  


తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  ఆగస్ట్ 22 వచ్చిందంటే మెగా ఫ్యాన్స్ కు పండగే. కేవలం చిరంజీవి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు.. మెగాభిమానులకు పండగ రోజే. అభిమానులు ప్రతి ఏటా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ను అట్టహాసంగా జరుపుతారు.  కాని కరోనా కారణంగా రెండేళ్లు మెగా బర్త్ డే వేడుకలు సరిగ్గా జరగలేదు. దాంతో ఆ ఈ సంవత్సరం చిరు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇందులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు ప్రెస్ మీట్ ను నిర్వహించి మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు.  ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్ డే  శిల్పకళ వేదికలో చేసేవాళ్ళం ఈ సంవత్సరం కొంచెం కొత్త గా ప్లాన్ చేస్తున్నాం అని తెలుపారు. , బర్త్ డే వేడుకలు లో అభిమానులు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అలానే అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్ నీ హైటెక్స్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇండియా లో ఏ సినిమా హిరో కి  కార్నివాల్ లాంటిది పెట్టలేదు, ఈ కార్నివాల్ ఫెస్టివల్ అనేది ఫ్యాన్స్ కి ఒక మెమ్రబుల్ డే గా ఉంటుందని ఆయన  తెలిపారు. 

ఇక చాలా ఊర్లలో లో చిరంజీవి బర్త్ డే నీ పండుగ లాగా చేసుకుంటారు కార్నివాల్ లో అన్ని ప్రాంతాల  అభిమానులు పాల్గొనాలని.. అక్కడ మెగా అభిమానులకు అన్ని సదుపాయాలు ఆ కార్నివాల్ లో వుంటాయి అని అభిమానులకు పిలుపునిచ్చారు నాగబాబు. ఇక ఈ కార్నివాల్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి  గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు పంచుకుంటానని ఆయన తెలిపారు. ఈ కార్నివాల్ ఫెస్టివల్ కి మా ఫ్యామిలీ నుంచి అందరూ హిరోలు పాల్గొంటారు. ఇతర హీరోలు,  ఆయనను అభిమానించే వారు అందరూ ఈ ఫెస్టివల్ లో పాల్గొంటారని మెగా బ్రదర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios