మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న కామెడీ,యాక్టన్ మూవీకి టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈమూవీ టైటిల్ అనౌన్స్ చేసేది ఎప్పుడో తెలుసా? 

 

మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ పరుగులుపెడుతోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ఇప్పటికే మూడు షెడ్యుల్స్ ను కంప్లీట్ చేసుకుంది. వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక మెగాస్టార్ సినిమా అంటే అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే మెగా ఫ్యాన్స్ నుంచి దర్శకుడికి వత్తిడి పెరుగుతుంటుంది.

ఈక్రమలో అనిల్ రావిపూడా ఈ ఇబ్బంది లేకుండా త్వరలో చిరంజీవి 157 మూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈమూవీ షూటింగ్ అయితే ఫాస్ట్ గా జరుగుతుంది కానీ.. ఈసినిమా టైటిల్ ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లిమ్స్ కు కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం. నెక్ట్స్ మన్త్ అంటే అగస్ట్ 22 న చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్స్ ను ప్లాన్ చేశారు. టైటిల్ ను ఆరోజు అనౌన్స్ చేసి, ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

చిరంజీవి చాన్నాళ్లకు కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతారా అనే ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి సినిమా టైటిల్స్ డిఫరెంట్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ టాక్ ప్రకారం అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమాకు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇందులో చిరంజీవి డ్యూయర్ రోల్ చేస్తున్నారన్న టాక్ కూడా ఉంది.

మరి అందులో ఎంత నిజం అనేది సినిమా ప్రమోషన్లు టైమ్ లో తెలిసిపోతుంది. మెగా ఫ్యాన్స్ మనసు గెలుచుకునే విధంగా , చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ ని టైటిత్ గా తీసుకున్నాడు అనిల్ రావిపూడి. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు నాడు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఒకవేళ టైటిల్ వేరే ఏదైనా కూడా ఆగస్టు 22 కి ఈ సినిమా గ్లింప్ రిలీజ్ చేసి టైటిల్ రిలీజ్ చేస్తారని సమాచారం. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు.